Site icon vidhaatha

42 ఏళ్ల వ‌య‌స్సులోనే చేప పిల్ల‌లా క‌దులుతున్న‌ధోని.. ఈ క్యాచ్ చూస్తే మ‌తి పోతుంది..!

చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి తిరుగు లేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల‌లో చెన్నై మంచి విజ‌యం సాధించింది. తొలి మ్యాచ్ ఆర్సీబీపై సూప‌ర్ విజ‌యం చ‌విచూసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ గ‌త రాత్రి గుజ‌రాత్ జెయింట్స్‌పై కూడా విజ‌యం సాధించి టేబుల్‌లో టాప్‌కి చేరింది. తాజా మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఏకంగా 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది . ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం త‌ప్ప‌ని త‌ర్వాత అర్ధ‌మైంది. చెన్నై బ్యాట్స్‌మెన్స్ శివమ్ దూబే( 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) , రుతురాజ్ గైక్వాడ్(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46), రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడ‌డంతో సీఎస్‌కే జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

207 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ టైటాన్స్ బ‌రిలోకి దిగ‌గా ఆదిలోనే ఆ టీంకి పెద్ద దెబ్బ త‌గిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 8 పరుగులు మాత్రమే చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత వృద్దిమాన్ సాహా 21 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. సాయి సుదర్శన్(31 బంతుల్లో 3 ఫోర్లతో 37) మినహా మిగతా బ్యాటర్లు ఎవ‌రు కూడా పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు. దీంతో జీటీ టీం 63 ప‌రుగుల తేడాతో ఓట‌మి చవి చూడాల్సి వ‌చ్చింది. అయితే చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండేసి వికెట్లు తీయగా.. డారిల్ మిచెల్, మతీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు.అయితే ఈ మ్యాచ్ లో ధోనీ తన ట్రేడ్ మార్క్ వికెట్ కీపింగ్‌తో అంద‌రిని ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయసులోనూ తన కీపింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించి వావ్ అనిపించేలా చేశాడు.

డారిల్ మిచెల్ వేసిన 8వ ఓవర్‌లో మూడో బంతిని మిచెల్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. శంకర్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్ వైపు దూసుకొచ్చింది. ధోనీ సూపర్ డైవ్‌తో బంతిని అద్భుతంగా అందుకోవ‌డంతో శంక‌ర్ నిరాశ‌గా పెవీలియ‌న్ చేరాడు.. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా.. ప్ర‌తి ఒక్క‌రు కూడా ధోనీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 42 ఏళ్ల వయసులోనూ.. ధోనీ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవ‌డం మాములు విష‌యం కాద‌ని, ఆయ‌న ఇంకా రెండేళ్లు ఆడే స‌త్తా ఉంద‌ని అంటున్నారు. ఇక చెన్నై టీంలోని మ‌రో సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ ర‌హానే కూడా అద్భ‌త‌మైన క్యాచ్ ప‌ట్టాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన 12వ ఓవర్‌లో లెగ్ స్టంప్ దిశగా వేసిన బాల్‌ని.. మిల్లర్ ఫ్లిక్ షాట్ ఆడాడు. దాంతో బంతి గాల్లోకి లేవడంతో. డీప్ మిడ్ వికెట్‌ నుంచి ముందుకు పరుగెత్తుకొచ్చిన రహానే.. సూపర్ డైవ్‌తో రహానే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. 


Exit mobile version