మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమెని చాలా మంది దేవతలా ఆరాధిస్తారు. ఐష్‌కి పెళ్లై ఒక కూతురు ఉన్నా కూడా ఆమె చాలా మందికి కలల రాణే. అభిషేక్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ఐష్ వైవాహిక జీవితం సజావుగానే సాగుతుంది. అయిన కూడా కొందరు కావాలని వారిద్దరు విడాకులు తీసుకున్నారని, విడిపోయి దూరంగా ఉన్నారని ప్రచారాలు చేస్తున్నారు. తాజాగా వాటికి కూడా చెక్ పడింది. ఆరాధ్య ప్రస్తుతం ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్‌నేషనల్ స్కూల్లో చదువుతుండగా, రీసెంట్‌గా ఆ స్కూల్ ఆన్యువల్ డే ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్‌కు ఆరాధ్య తల్లిదండ్రులు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంటగా హాజరై సందడి చేశారు. దీంతో పుకార్లన్నింటికి పులిస్టాప్ పడింది.
అయితే యాన్యువల్ డే ఫంక్షన్‌లో ఆరాధ్య ఒక నాటకం వేసింది. ఇది ధీరూభాయ్ అంబానీ ఇంటర్‌నేషనల్ స్కూల్‌కు సంబంధించిన యాడ్‌లా కనిపించగా, ఇందులో ఆరాధ్య ఆరాధ్య గుక్క తిప్పుకోకుండా ఎంతో అవలీలగా.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పి తల్లికి తగ్గ కూతురు అని నిరూపించింది. ఆరాధ్య వీడియోను సినిమా జర్నలిస్ట్ క్రిస్టోఫర్ కనగరాజ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోని చూసిన నెటిజన్స్ ‘‘ ఐశ్వర్య రాయ్ కూతురా అక్కడున్నది. ఇంతలో ఎంత ఎదిగిపోయింది, అస్సలు గుర్తు పట్టలేకుండా ఉన్నాం అని కామెంట్ చేస్తున్నారు’’.. . మరి కొందరు యాక్టింగ్‌లో తల్లిని మించిపోయేలా ఉంది’’.. ‘‘ ఎంతైనా బిగ్‌బీ కుటుంబం కదా.. ఆ మాత్రం యాక్టింగ్ చేయకపోతే బాగుండదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వీడియోలో ఆరాధ్య పొడవాటి నలుపు రంగు వస్త్రాన్ని ధరించింది. అలానే ముత్యాల ఆభరణాల పొరలను ధరించి కనిపించింది. అయితే, ఆమె అందమైన డిజైనింగ్ కేశాలంకరణ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె జుట్టు ఎత్తైన బన్‌లో కట్టబడి ఉండగా, బ్యాంగ్స్ ఫ్లవర్ హెయిర్‌బ్యాండ్‌తో చక్కగా పైకి లాగబడ్డాయి. ఆరాధ్య లుక్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఆరాధ్య ఫస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
Aaradhya Bachchan’s (Aishwarya Rai’s Daughter) Annual day performance at Dhirubhai Ambani International school.
— Christopher Kanagaraj (@Chrissuccess) December 16, 2023