హీరోతో మీనాకి లింక్.. రెండో పెళ్లి వార్త‌లు చాలా బాధించాయంటూ కామెంట్

  • Publish Date - December 27, 2023 / 03:32 PM IST

తెలుగుతో పాటు త‌మిళంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ మీనా. ఈ అమ్మ‌డు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాగా, ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, రజనీ కాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి దక్షిణాది స్టార్‌ హీరోలతో క‌లిసి న‌టించిన మీనా మూడు ద‌శాబ్దాల పాటు ఇండ‌స్ట్రీని ఏలింది. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే విద్యాసాగర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల‌కి కుమార్తె పుట్టడంతో ఈమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే ఆమె కుమార్తె పెరిగి పెద్దవ్వడంతో తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ బిజీగా ఉన్న సమయంలోనే ఆమె భ‌ర్త మ‌ర‌ణించారు. భ‌ర్త మ‌ర‌ణంతో మీనా కుంగిపోయింది. చాలా రోజుల పాటు ఆ విషాదం నుండి కోలుకోలేక‌పోయింది. ఇక ఇప్పుడు మీనా ప‌లు సినిమాలు చేస్తూనే బుల్లితెర‌పై కూడా సందడి చేస్తుంది.అయితే మీనా మళ్లీ పెళ్లి చేసుకోనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోన్న మీనా మరోసారి తన రెండో పెళ్లి వార్తలపై స్పందించింది. అలాగే తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ నా భర్తకు లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సింది. అయితే చికిత్స ఆలస్యమైంది. దీంతో పరిస్థితి చేజారిపోయింది. నా భర్త చనిపోయిన రెండు నెలలకే నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి.

హీరో ధనుష్‌తో కూడా లింక్‌ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు. వీటిని చదివి నా కుటుంబీకులు ఎంత బాధపడుతారో కూడా ఆలోచించ‌కుండా చెత్త ప్ర‌చారాలు చేశారు. వాటిని చూసి నాకు చాలా కోపం వ‌చ్చింది. మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న నాకు లేదు. రేపు ఏం జ‌రుగుతుంద‌నేది కూడా ఊహించ‌లేను అని మీనా స్ప‌ష్టం చేసింది. మా వారితో గొడ‌వ‌లు ఉన్న‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. కాని అవ‌న్నీ అవాస్త‌వాలు. నిజానికి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్లం అని మీనా పేర్కొంది.

Latest News