Site icon vidhaatha

అభిషేక్ బ‌చ్చ‌న్- ఐశ్వ‌ర్య‌రాయ్ విడాకులు క‌న్‌ఫాం.. దీనిని సాక్ష్యంగా చూపుతున్న నెటిజ‌న్స్

బాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న జంట ఎవ‌రంటే ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేది ఐశ్వ‌ర్య‌రాయ్- అభిషేక్ బ‌చ్చ‌న్‌లు. దాదాపు 17 ఏండ్ల సుదీర్ఘ వైవాహిక బంధం వీరిది కాగా, ఈ జంట‌ని చూసి చాలా మంది మురిసిపోయేవారు. అయితే కొద్ది రోజులుగా వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయని, విడాకులు తీసుకున్నార‌ని జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఐశ్యర్యరాయ్‌ సోషల్‌ మీడియా ఖాతాలను అమితాబ్‌ అన్‌ఫాలో చేశారని మీడియాలో కథనాలొచ్చాయి. అయితే గ‌త ఏడాది డిసెంబ‌ర్ నెల‌లో ముంబయిలో జరిగిన ఓ స్కూల్‌ వార్షికోత్సవ వేడుకలో అమితాబ్‌బచ్చన్‌, అభిషేక్‌, ఐశ్వర్యరాయ్‌ కలిసి పాల్గొన్నారు. ముగ్గురూ సరదాగా నవ్వుతూ కనిపించారు. దీంతో విడాకుల రూమర్స్‌కు చెక్‌ పడినట్లయింది.

కాని తాజాగా అభిషేక్ బ‌చ్చ‌న్- ఐశ్వ‌ర్య‌రాయ్ విడాకుల వ్య‌వ‌హారం మ‌రోసారి వార్త‌ల‌లోకి వ‌చ్చింది. ఇటీవ‌ల అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంకి అనేక రంగాల నుండి ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రైన విష‌యం తెలిసిందే. సినీ రంగం నుండి పెద్ద పెద్ద హీరోలు ఈ వేడుక‌కి హాజ‌రు కాగా, వారిలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఉన్నారు. అమితాబ్ త‌న కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌తో ఈ కార్య‌క్ర‌మానికి హాజరు కాగా, వారితో ఐశ్వర్య‌రాయ్ క‌నిపించక‌పోవ‌డం అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తున్నాయి. అయోధ్య ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మంలో భాగంగా అభిషేక్ బచ్చన్ మాత్రమే హాజరై ఐశ్వర్య లేకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండడం నిజమేనని, అందుకే ఇద్ద‌రు క‌లిసి హాజ‌రుకాలేద‌ని అంటున్నారు.

ఐశ్వ‌ర్య‌రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత తమిళ సినిమాలతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. తమిళంతో పాటు హిందీ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీస్ లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే కెరీర్ కొంత డౌన్ ఫాల్ అవుతున్న స‌మ‌యంలో అంటే 2007లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. అప్ప‌టి నుండి వీరిద్ద‌రు అన్యోన్యంగా ఉన్నారు. ఈ జంట‌కి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే ఇటీవ‌లి కాలంలో అభిషేక్ బ‌చ్చ‌న్- ఐశ్వ‌ర్య రాయ్ విడాకుల వార్త‌లు ఎక్కువగా వినిపిస్తుండ‌డం అభిమానుల‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది.

Exit mobile version