Site icon vidhaatha

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ఆకాశ్ పూరి.. ఆమెని ల‌వ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడా..!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రు అనే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఆయన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం త‌ర్వాత మ‌ళ్లీ హిట్ కొట్ట‌లేదు. మంచి హిట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి కూడా ఇండ‌స్ట్రీలో హీరోగా నిల‌దొక్కుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేయినప్పటికి ఆయనకి కమర్షియల్ గా అయితే ఇప్పటి వరకు ఒక హిట్ కూడా దక్కలేదు.ఆయన పర్ఫామెన్స్ బాగున్నప్పటికీ ఆయన కి హిట్ అయితే దక్కడం లేదు… వాళ్ల నాన్న అంత పెద్ద డైరెక్టర్ అయిన కూడా ఆకాష్ పూరిని అదృష్టం వ‌రించ‌డం లేదు.

తాజాగా ఆకాశ్ పూరికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ తన క్లాస్ మేట్ అయిన అమ్మాయిని ప్రేమించాడని, వీళ్ళ ప్రేమ హద్దులు మీరిపోయిందనే టాక్ న‌డుస్తుంది. త్వరలోనే ఇద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నారంట. పెళ్లికి ఇరువైపులా కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతే సోషల్ మీడియాలో అధికారికంగా లీకైందంటున్నారు. అంతేకాదు.. ఆ అమ్మాయి ఓ బడా రాజకీయ నాయకుడి మనవరాలని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోట్ల రూపాయ‌ల ఆస్తికి ఆ అమ్మాయి వార‌సురాలు కావ‌డంతో ఆకాశ్ పూరి జాక్ పాట్ కొట్టాడ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. మ‌రి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

ఇక ఆకాశ్ పూరి విష‌యానికి వ‌స్తే.. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యాడు. నటనలో స్టార్స్ ను మించిపోయాడు. చిన్నతనంలోనే ఆకాశ్ నటనకు ప్రేక్ష‌కులు తెగ‌ ముగ్దులైపోయారు. అయితే ఓ వయస్సుకు వచ్చాక హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాశ్. కాని ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌ హిట్ మాత్రంకొట్టలేకపోయాడు. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఆకాశ్. ఇక పూరీ జ‌గ‌న్నాథ్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో స్టార్ డైరెక్ట‌ర్‌గా వెలుగు వెలిగిపోతుండ‌గా, ఆయ‌న మహేష్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కు హీరోగా లైఫ్ ఇచ్చిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఈమూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతుంది.

Exit mobile version