Site icon vidhaatha

సినీ తార‌ల‌తో అట్ట‌హాసంగా ఐపీఎల్ ప్రారంభ వేడుక‌…ఏఏ సెల‌బ్రిటీలు సంద‌డి చేయ‌నున్నారంటే..!

ధనాధ‌న్ లీగ్ ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు కొన్ని రోజులుగా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుండ‌గా, ఈ ఎడిష‌న్ తొలి మ్యాచ్‌లో రెండు ట‌ఫ్ టీమ్స్ స‌మ‌రానికి సై అంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెన్నైలోని ఎం చిదంబరం మైదానంలో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాయి. తొలి మ్యాచే వీక్ష‌కుల‌కి మంచి మ‌జా అందిచండంఖాయంగా చెప్ప‌వ‌చ్చు. అయితే ప్ర‌తి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐపీఎల్ ఈవెంట్‌ని అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు బీసీసీఐ స‌న్నాహాలు చేస్తుంది.

తొలి రోజు మ్యాచ్‌కి కొన్ని గంట‌ల ముందుకు ప్రారంభోత్స‌వ వేడుక‌ని నిర్వ‌హంచ‌బోతున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఐపీఎల్ ప్రారంభోత్సవం ప్రారంభం కానుండ‌గా, ఈ వేడుక‌ సుమారు గంట పాటు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది.ఈవెంట్‌లో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు తెగ సంద‌డి చేయ‌నున్నారు. ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్, నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు ఈ ఈవెంట్‌లో త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేయ‌నున్నారు. గ‌త ఏడాది రష్మిక మందన్న, తమన్నా భాటియా, అర్జిత్ సింగ్ గ్రాండ్ ఈవెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఆడియ‌న్స్‌ని మంత్ర ముగ్ధులని చేయ‌డం మ‌నం చూశాం.

ఈ ఈవేడుక‌లతో పాటు మ్యాచ్‌ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లు జియో సినిమా యాప్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఓపెనింగ్ మ్యాచ్ త‌ప్ప అన్ని నైట్ మ్యాచ్‌లు కూడా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకు ప్రారంభం అవుతాయి. ఇక ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడడం ఇది తొమ్మిదోసారి కాగా గ‌తంలో 2009, 2011, 2012, 2018, 2019, 2022,2023 సీజన్లలో ఈ టీం ఓపెనింగ్ మ్యాచ్ ఆడి అద‌ర‌గొట్టింది.ఇక ఈ సీజ‌న్ ధోనికి చివ‌రి సీజ‌న్‌గా చెబుతున్నారు. 

Exit mobile version