Site icon vidhaatha

భారీ ఆస్తుల‌ని అమ్మ‌బోతున్న అల్లు అర్జున్.. ఆయ‌న‌కి అంత క‌ష్టం ఎందుకు వ‌చ్చింది..!

టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అర‌వింద్ త‌న‌యుడు, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.గంగోత్రి సినిమా నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప సినిమాతో ఆయ‌న‌కి దేశం మొత్తం ఫిదా అయింది. స్టార్ క్రికెట‌ర్స్, రాజ‌కీయ నాయ‌కులు సైతం బ‌న్నీ న‌ట‌న‌కి మంత్ర ముగ్ధుల‌య్యారు. ఇక పుష్ప సినిమాలో బ‌న్నీ న‌ట‌న‌కి కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌మ న‌టుడి అవార్డ్ కూడా అందించింది. ప్ర‌స్తుతం పుష్ప‌2 అనే చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమాతో అల్లు అర్జున్ స‌రికొత్త చరిత్ర సృష్టించ‌డం ఖాయంగా చెబుతున్నారు.

అయితే బ‌న్నీ సినిమాల ప‌రంగానే కాక బిజినెస్‌ల ప‌రంగా కూడా భారీగానే సంపాదిస్తున్నాడు. పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం, ఫుడ్, రెస్టారెంట్స్ రంగంలో దూసుకుపోతున్నాడు. మ‌రోవైపు త‌న ఫ్యామిలీకి సంబంధించిన తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అయ్యేందుకు త‌న వంతు కృషి చేస్తున్నాడు. అడ‌పాదడ‌పా ఆహాలో మెరుస్తూ సంద‌డి కూడా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’ని అమ్మ‌బోతున్నారంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజమున్నదనేది తెలియ‌దు కాని ప్ర‌స్తుతం ఈ వార్త ఇండ‌స్ట్రీలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావ‌ల‌సి ఉంది.

2020లో ప్రారంభమైన ఆహాకి అల్లు అరవింద్ కో ఫౌండర్ గా ఉన్నారు. అల్లు అర్జున్ దీనిని గ‌ట్టిగానే ప్ర‌మోట్ చేశారు. కొన్నాళ్ల‌పాటు ఇది బాగానే న‌డిచింది. అయితే ఇప్పుడు మాత్రం రెవిన్యూ అంత‌గా రావ‌డం లేద‌ని, ప్రాఫిట్ కూడా స‌రిగా లేద‌ని అంటున్నారు. రీసెంట్ గా ఆహాలో సినిమాలు పెద్దగా రాక‌పోవ‌డం, స‌రైన షోస్ లేక ఆద‌ర‌ణ త‌క్కువ కావ‌డం మరోవైపు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, జీ5 పెద్ద కంపెనీల పోటీని ఆహా త‌ట్టుకోలేక‌పోతుంద‌ని ఓ టాక్ గ‌ట్టిగా వినిపిస్తుంది. మ‌రి దీనిపై ఆహా టీం ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version