Site icon vidhaatha

రెండో పెళ్లికి రెడీ అయిన అమ‌లాపాల్‌.. ప్రియుడిని ముద్దుల‌తో ముంచెత్తిందిగా..!

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అమ‌లాపాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బోల్డ్ కామెంట్స్‌తో పాటు హాట్ అందాల‌తో కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉంటుంది అమ‌లాపాల్. ఈ అమ్మ‌డు ఎప్పటిక‌ప్పుడు ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. 2014 లో డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మ‌డు విభేదాల కారణంగా 2017 లో విడిపోయింది. ఆ త‌ర్వాత కొన్ని రోజుల పాటు సోలోగా ఉన్న ఈ భామ 2018 లో త‌న స్నేహితుడు, సింగర్ భవీందర్ సింగ్‌ను పెళ్లాడింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఓ షూట్‌లో భాగ‌మ‌ని మా పెళ్లి నిజం కాద‌ని అమ‌లాపాల్ కొట్టి పారేసింది. ఇక వ్యాపారంలో అతనితో వచ్చిన విభేదాలతో భవీందర్ సింగ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. అమలా పాల్.

అయితే అమ‌లాపాల్ త‌న బ‌ర్త్ డే రోజు పెద్ద స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. తన స్నేహితులతో కలిసి పబ్బులో ఎంజాయ్ చేస్తుండగా.. ఆమె ముందుకు పెళ్లి ప్రపోజల్ తో వచ్చిన వ్య‌క్తి స‌ర్ప్రైజ్ చేశాడు. అప్పుడు అమ‌లాపాల్ అతనిని రిజెక్ట్ చేయ‌కుండా సంతోషంగా రెండో పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ప్ర‌స్తుతం అమ‌లాపాల్ కి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. మ‌రి ఆ వ్య‌క్తి పేరు ఎంటంటే.. జగత్ దేశాయ్ . అత‌ను త‌న ఇన్ స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ… నా రాణితో ఒప్పుకుంది.. పెళ్లి భాజాలు మోగతాయి, హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ రాసుకు రావ‌డంతో అమలాపాల్ రెండో పెళ్లికి సిద్ధ‌మైందంటూ ప్ర‌చారం జరుగుతుంది.

అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అభిమానులు మురిసిపోతున్నారు . కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. వాట్ ఎ ప్రపోజల్ అంటూ కూడా పలువురు ఫ్యాన్స్ తమ మనసులోని భావాలను సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు. అయితే జ‌గత్ దేశాయ్‌కి సినీ నేప‌థ్యం లేదు కాని బంధువులు లేదా స్నేహితుల ద్వారా తెలిసి ఉండవచ్చని అంతా భావిస్తున్నారు. మరికొంత కాలం గడిస్తే తప్ప వీరి వీరి ప్రేమ కథ బయటకు వచ్చేలా లేదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version