Site icon vidhaatha

2023 చివ‌ర‌లో అన‌సూయ‌లో క‌ట్ట‌లు తెంచుకున్న కోపం..ఏం జరిగింది అంటే..!

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి ఫేమ్ సంపాదించి ఆ త‌ర్వాత న‌టిగా సెటిలైన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడచ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఈ ముద్దుగుమ్మ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రిస్తుంది. అయితే ప్ర‌స్తుతం పుష్ప2తో పాటు ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న అన‌సూయ న్యూ ఇయ‌ర్ వేళ ఫుల్ సీరియ‌స్ అవుతూ ఒక వీడియో విడుద‌ల చేసింది. మ‌రి అన‌సూయ‌ని అంత‌లా హ‌ర్ట్ చేసింది ఎవ‌రు, అమ్మ‌డు అంత సీరియ‌స్ కావడానికి కార‌ణ‌మేంట‌నేది ఇప్పుడు చూద్దాం.. అన‌సూయ 2023 లో ప‌లు వివాదాల‌తో హాట్ టాపిక్ అయింది . ఈ క్ర‌మంలో నా మాటలు, బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే… మీకు మంచిగా అయ్యింది. 2024లో కూడా నేను ఇలానే ఉంటా. నా జోలికి వస్తే దూల తీర్చి, దూపం వేస్తా… అంటూ బూతులతో రెచ్చిపోయింది.

బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌కి అన‌సూయ ఇలా యాక్ష‌న్ చేస్తూ వీడియో చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అన‌సూయ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అన‌సూయ వివాదాల విష‌యానికి వ‌స్తే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎక్కువ‌గా గ్లామ‌ర్ షో చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. ఈ క్ర‌మంలో ప‌లు విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొంటుంది. ఈ క్ర‌మంలో నా బట్టలు నా ఇష్టం. విమర్శించడానికి మీరెవరు అంటూ ఎదురు ప్రశ్నించింది. అనంత‌రం విజయ్ దేవరకొండను గెలికి మరీ వివాదం రాజేసింది. లైగర్ మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకోగా… శాస్తి జరిగింది అన్న కోణంలో ఆమె కామెంట్ పెట్ట‌గా. ఆ స‌మ‌యంలో విజ‌య్ ఫ్యాన్స్‌కి, విజ‌య్‌కి మధ్య ర‌చ్చ జ‌రిగింది.

2023 చివ‌ర‌లో అన‌సూయ‌లో క‌ట్ట‌లు తెంచుకున్న కోపం..ఏం జరిగింది అంటే..!ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టి ఖుషీ చిత్ర స‌మ‌యంలో కూడా ఆయ‌న ఫ్యాన్స్‌ని గెలికింది అన‌సూయ‌. విజయ్ దేవరకొండ పేరుకు ముందు The అని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. సెటైర్ వేశారు. ఈ వివాదం చాలా రోజుల పాటు న‌డిచింది. ఓ సందర్భంలో కావాలనే నేను విజయ్ దేవరకొండ మీద పోస్ట్స్ పెట్టాను. ఆయన వద్ద పని చేసే వ్యక్తి డబ్బులిచ్చి నా మీద ట్రోలింగ్ చేయించారని తెలిసి ఇలా చేసాన‌ని పేర్కొంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి తెలియ‌కుండా ఇది జరిగి ఉండ‌దు. అందుకే ఆయ‌న‌కి వ్య‌తిరేఖంగా పోస్ట్ పెట్టాన‌ని తెలియ‌జేసింది. ఇలా 2023లో ఈ అమ్మడు చాలా వివాదాల‌తో హైలైట్ అయింది. ఇక గ‌త ఏడాదిలో అన‌సూయ మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు, ప్రేమ విమానం చిత్రాల్లో ఆమె నటించారు. ఇక పుష్ప 2లో లేడీ విలన్ గా అల‌రించేందుకు సిద్ధ‌మైంది.

Exit mobile version