ఒకప్పుడు బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన అందాల ముద్దుగుమ్మ అనసూయ. చూడ చక్కని అందంతో ఎంతో మందిని కట్టిపడేసింది. ప్రస్తుతం నటిగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడునాలుగు చిత్రాలు ఉన్నాయి.అందులో పుష్ప2 చిత్రంపై బోలెడన్నీ హోప్స్ పెట్టుకుంది. ఈ ఏడాది అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదల కాగా, ఇందులో ఏ చిత్రం కూడా కమర్షియల్ హిట్ కాలేదు. అయినప్పటికీ అనసూయ జయాపజయాలతో సంబంధం లేకుండా అనసూయ వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతుంది. అంతేకాదు తన అభిమానులని క్రమంగా పెంచుకుంటూ పోతుంది.
కెరీర్ పరంగా అనసూయ లైఫ్ బాగానే ఉంది. కోట్లు సంపాదించిన అనసూయ లైఫ్ సెటిల్ అయిందనే చెప్పాలి. తీరిక లేకుండా రెండు చేతులా సంపాదిస్తున్న ఈ భామ హైదరాబాద్ లో ఓ లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. భర్త, ఇద్దరు కొడుకులతో హ్యాపీగా జీవిస్తున్నారు. ఇక వీలున్నప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలకి వెళుతుంటుంది. వాటికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తన గ్లామరస్ షోకి సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బొద్దుగుమ్మ ఫ్రాక్‌లో తన అందాలన్ని బయటపెట్టి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది. అనసూయని ఇలా చూసి రోజురోజుకి నీ వయస్సు తగ్గిపోతుందిగా అని కొందరు కొంటె కామెంట్స్ చేస్తున్నారు.
జబర్ధస్త్ షోతో అనసూయ ఫుల్ పాపులారిటీ పెంచుకుంది. కాని గత ఏడాది అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఖరాఖండీగా చెప్పుకొచ్చింది. టీఆర్పీ కోసం మేకర్స్ చెత్త స్టంట్స్ నాకు నచ్చడం లేదని ఓ సందర్భంలో ఓపెన్ అయ్యింది. అయితే బుల్లితెర ఆడియన్స్ తనని ఎక్కడ మరిచపోతారేమోనని ఇలా అప్పుడప్పుడు అందాల విందు వడ్డిస్తుంటుంది. అనసూయ గ్లామర్ లుక్స్‌కి కుర్రాళ్లు థ్రిల్ అయపోయి మత్తులో మునిగితేలడం ఖాయం.