యాంకరింగ్ నుండి నటిగా మారిన అనసూయ ఇటీవలి కాలంలో వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం విజయ్ దేవరకొండతో ఆమె చేసిన సోషల్ మీడియా ఫైట్ ఎంత హాట్ టాపిక్ అయిందో మనందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ ఎదుర్కొన్నా కూడా అనసూయ ఏ మాత్రం తగ్గదు. ట్రోలర్స్‌కి గట్టిగా సమాధానం ఇస్తూ తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ తనపై వచ్చే ట్రోలింగ్‌తో పాటు కెరీర్ బిగినింగ్‌లో చోటు చేసుకున్న పలు అంశాలపై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అనసూయ.. ఎన్టీఆర్ నటించిన నాగ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. అయితే ఆ తర్వాత అనసూయకి పెద్దగా ఆఫర్స్ రాలేదని, జూనియర్ ఆర్టిస్ట్‌గా స్ట్రగుల్ కావడంతో జబర్ధస్త్ షోకి వచ్చిందని, దానితో ఆమెకి బ్రేక్ వచ్చిందని అందరు అనుకుంటారు. కాని అది నిజం కాదని అనసూయ పేర్కొంది.
అప్పట్లో ఆర్య 2 సినిమాలో ఓ పాత్ర కోసం సుకుమార్ తనని అడగగా, ఆ ఆఫర్‌ని సింపుల్‌గా రిజెక్ట్ చేసిందట అనసూయ. ఇప్పటికీ ఆయన నువ్వు నాకు నో చెప్పావని అంటుంటారు. అయితే హీరోలు అందరు లైన్ వేయడానికి ఉంటారని అప్పట్లో చాలా ఫీలయ్యేదాన్ని. అత్తారింటికి దారేది చిత్రంలో ఐటెం సాంగ్ రిజెక్ట్ చేయడానికి కారణం ఉందని అనసూయ పేర్కొంది. ఇక మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా అనసూయ విదేశాలకి వెళ్లి అక్కడ బికినీ వేసింది. తన బికినీ ఫొటోలని అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఆ ఫొటోలని చూసిన నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు. హేటర్స్ ని రెచ్చగొట్టేందుకే అనసూయ అలాంటి ఫోటోలు షేర్ చేశారంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు. దానిపై తాజాగా స్పందించింది అనసూయ.
ఆ రోజు మా పెళ్లి రోజు కాబట్టి వెకేషన్‌కి వెళ్లాము. అప్పుడు నా ఫోటోలు నా ఇన్‌స్టాగ్రాములో పెడితే వాళ్లకి ఏంటి ఇబ్బంది అని అనసూయ ప్రశ్నిస్తూ తనపై వచ్చిన ఆరోపణలు పరోక్షంగా ఖండించింది. ఆంటీ అంటే కోపం ఎందుకు? పుష్ప 2లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది వంటి పలు విషయాలపై అనసూయ ఆసక్తికర కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అనసూయ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదల కాగా, ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అయ్యాక మాత్రమే అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలుస్తుంది. ఇక అనసూయ ఈ ఏడాది ఆమె నటించిన రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు మోస్తరు విజయం దక్కించుకున్నాయి. రంగస్థలంలో రంగమ్మత్త వంటి పాత్ర అనసూయకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.