అందాల ముద్దుగుమ్మ అనసూయ ఎప్పుడు వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. చూడ చక్కని అందంతో కుర్రాళ్ల మతులు పోగొడుతూ ఉండే ఈ భామ నటనతో కూడా మెప్పిస్తూ ఉంటుంది. కొన్నాళ్లపాటు యాంకర్‌గా ఓ ఊపు ఊపిన అనసూయ ఇప్పుడు నటిగా అదరగొడుతుంది. అయితే చాలా రోజుల తర్వాత తిరిగి బుల్లితెరపై సందడి చేసింది అనసూయ. జీ కుటుంబం అవార్డ్స్ 2023 వేడుకలో అనసూయ అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆదివారం సాయంత్రం 6గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో అనసూయ తన పెర్ఫామెన్స్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఈ పర్‌ఫార్మెన్స్‌లో అనసూయ అలనాటి నటీమణులు సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య లను ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేసింది.
పాత తరం నటీమణులని అనసూయ గుర్తు తెస్తూ ఇచ్చిన పర్‌ఫార్మెన్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఇక అనసూయ కూడా వారిని ఇమిటేట్ చేస్తున్న కొన్ని ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్‌ని అలరించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం అనసూయకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సావిత్రి గారి లుక్ లో అనసూయ చాలా బాగుందంటూ కొందరు తెగ పొగుడుతున్నారు. లైక్స్, కామెంట్లతో ఆ ఫొటోలను ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు హాట్ హాట్‌గా కనిపిస్తూ కురచ దుస్తులలో రచ్చ చేసే అనసూయ ఇప్పుడు ఇలా పద్దతిగా కనిపించే సరికి ప్రతి ఒక్కరు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక అనసూయ ఇప్పుడు వెండితెరపై వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీగా మారుతున్నా కూడా ఆమెకు గుర్తింపు తెచ్చే పాత్రలు అయితే రావడం లేదు. రంగస్థలం చిత్రంతో అనసూయకి మంచి పేరు రాగా మళ్లీ అలాంటి పాత్ర ఇప్పటి వరకు ఈ అమ్మడికి దక్కలేదనే చెప్పాలి. ఇటీవల ‘రంగమార్తాండ’, ‘విమానం’, ‘ప్రేమ విమానం’ వంటి సినిమాలతో ప్రేక్షకులని అలరించింది. ఇప్పుడు అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందుతున్న పుష్ప2లో నటిస్తుంది. ఈ చిత్రంలో దాక్షాయణిగా కనిపించి అలరించనుంది.