బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. హిందీ, తమిళం, తెలుగు భాషలలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఒక్కోసారి హౌజ్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడడం మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లైన మరికొందరు భార్య భర్తలుగా హౌజ్‌లోకి అడుగుపెట్టడం కూడా మనం చూశాం. తెలుగులో చూస్తే వరుణ్ సందేశ్-వితిక షేరు అలాగే రోహిత్-మరీనా భార్యాభర్తలు హోదాలో బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టి సందడి చేశారు. ఇక ఇప్పుడు హిందీలో బిగ్ బాస్ సీజన్ 17 ప్రసారం అవుతుండగా, ఈ షోలో భార్యాభర్తలైన నటి అంకిత లోఖండే, విక్కీ జైన్ పాల్గొన్నారు.
అక్టోబర్ 15 నుండి సీజన్ 17 ప్రసారం అవుతుండగా, 14వ సారి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజా సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న అంకిత తాను ప్రెగ్నెంట్ అయ్యానేమో అన్న అనుమానం వ్యక్తం చేసింది. తనకి ఒంట్లో కాస్త ఇబ్బందిగా అనిపించడంతో మెడికల్ రూమ్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేయించుకుందట. ఈ విషయాన్ని తన భర్తతో తెలిపింది. గర్భం దాల్చానేమో అని టెన్షన్ గా ఉందని అంకిత తన భర్తతో అన్నారు. తనకి కడుపులో ఇబ్బందిగా ఉంది, ఇంటికి వెళ్లాలని అనిపిస్తుంది అని అంకిత చెప్పడంతో ఆమె భర్త విక్కీ జైన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మరి రిజల్ట్ అనేది ఏంటనేది తెలియదు కాని ఒకవేళ పాజిటివ్‌గా వస్తే మాత్రం బిగ్ బాస్ హౌస్లో గర్భం దాల్చిన మొదటి మహిళగా రెకార్డులకు ఆమె ఎక్కడం ఖాయం. ఇక అంకిత లోఖండే విషయానికి వస్తే ఆమె సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ కి జంటగా పవిత్ర రిస్తా టైటిల్ తో ఓ సీరియల్ చేసింది. ఆ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కాని ఊహించని విధంగా ఇద్దరు విడిపోయారు. సుశాంత్ చనిపోయినప్పుడు అంకిత పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే ఈ అమ్మడు 2021లో వ్యాపారవేత్త విక్కీ జైన్ ని వివాహం చేసుకోగా, వారిద్దరి వైవాహిక జీవితం బాగానే ఉంది.