మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని రఫ్ఫాడించింది.చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ స్టార్ హీరోలతో నటించకపోయిన తను నటించిన ప్రతి సినిమాతో మంచి హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రేమమ్ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అఆ’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుపమ పర్‌ఫార్మెన్స్‌కి మంచి అప్లాజ్ దక్కడంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. అనుపమ ఏ ప్రాజెక్ట్ పడితే ఆ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పదు.
తనకి నచ్చిన కథతోనే సినిమాలు చేస్తుంది. అయితే ఒకప్పుడు చాలా పద్దతిగా సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ట్రెండ్ మార్చింది. ఎవరూ ఊహించని విధంగా లిప్ లాక్ సీన్ లో కనిపిస్తూ ఔరా అనిపిస్తుంది. ఒకప్పుడు ఒక హీరోకు లిప్ లాక్ ఇచ్చే సన్నివేశం ఉందని సినిమాను రిజెక్ట్ చేసిన అనుపమ దిల్ రాజు సోదరుడు నిర్మాత శిరీష్ తనయుడు అయిన ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అయిన రౌడీ బాయ్స్ చిత్రంలో లిప్ లాక్‌లతో రెచ్చిపోయింది. అప్పటి వరకు ఇలాంటి సన్నివేశాలలో పెద్దగా కనిపించని అనుపమ మొదటిసారి లిప్ లాక్ సీన్ లో కనిపించే సరికి అందరు అవాక్కయ్యారు. సినిమా కాన్సెప్ట్ నచ్చినందుకే అనుపమ ఆ లిప్ లాక్ సీన్ లో నటించినట్లు చెప్పుకొచ్చింది.
అయితే ఇప్పుడు అనుపమ టిల్లు స్క్వేర్‌లో నటిస్తుండగా మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ఘాటు లిప్ లాక్ సీన్లతో అరాచకం సృష్టించారు. కారులో సిద్ధు, అనుపమ కిస్సింగ్ సీన్ చూసి అందరు నోరెళ్లపెట్టారు. సిద్దు డైలాగ్‌లతోనే కాకుండా అనుపమ ముద్దు సీన్లతో రచ్చ లేపారు. వారి రొమాన్స్ చూసి ప్రతి ఒక్కరు షాకయ్యారు. అసలు అనుపమలో ఇంత మార్పుకి కారణం ఏంటి. కేరళ కుట్టి అవకాశాల కోసం హాట్ షోతో పాటు ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కూడా రెడీ అవుతుందా అని అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి టిల్లు స్క్వేర్ ట్రైలర్‌తో సిద్ధు,అనుపమ థియేటర్స్‌ని తగలపెట్టేస్తారా అని అందరిలో తలెత్తుతున్నాయి.