Site icon vidhaatha

టిల్లుగాడితో లిప్‌కిస్ చేసేట‌ప్పుడు త‌న ఫీలింగ్ ఏంటో చెప్పి షాకిచ్చిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అఆ సినిమాలో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లో న‌టించి అద‌ర‌గొట్టిన అనుప‌మ ఆ త‌ర్వాత హీరోయిన్‌గా చాలా చిత్రాలు చేసింది. ఇవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అయితే ఈ మ‌ధ్య అనుప‌మ‌కి పెద్దగా ఆఫ‌ర్స్ రావ‌డం లేదు. దీంతో ఒక‌ప్పుడు ప‌ద్ద‌తిగా క‌నిపించిన ఈ భామ ఇప్పుడు మాత్రం అందాలు పీక్స్‌లో ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. టిల్లు స్క్వేర్ అనే చిత్రంలో సిద్ధుకి జోడిగా న‌టించింది. ఇందులో ఈ భామ రొమాన్స్‌తో ర‌చ్చ‌చేసింది. ఇప్ప‌టికే మూవీకి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్‌ల‌లో సిద్ధు, అనుప‌మ రొమాన్స్ చూసి అంద‌రు షాక్ అయ్యారు. ఎలా ఉండే అనుప‌మ ఎలా అయిపోయిందంటూ కామెంట్స్ చేశారు. టిల్లు స్క్వేర్ చిత్రం రేపు విడుద‌ల కానుండ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది చిత్ర బృందం.

అయితే ప్ర‌మోష‌న్స్‌లో అనుపమకు రొమాంటిక్ సీన్స్ కి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఈ క్ర‌మంలో అనుప‌మ షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది.యాంక‌ర్ చిత్రంలోని లిప్ కిస్, రొమాన్స్ గురించి ప్ర‌శ్న‌లు వేయగా అనుప‌మ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. అంద‌రు రొమాంటిక్ సీన్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ రొమాంటిక్ సీన్ లో నటించి ఎగ్జిక్యూట్ చేయడం అంత ఆశామాషి కాదు. సెట్ లో వందల మంది మధ్యలో అలాంటి సీన్ లో నటించాలంటే న‌ర‌కం క‌నిపిస్తుంది. ఇద్దరు ఇంటిమేట్‌గా ఉన్నారంటే అది వాళ్ల ప్రైవేట్ మూమెంట్‌. కాని సెట్‌లో అంద‌రి ముందు చేయాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి.

కారులో లిప్ కిస్ సీన్ చేయాలి. ఆ స‌మ‌యంలో నా రెండు కాళ్ల‌కి గాయాలు ఉన్నాయి. ఎంత న‌ర‌కంగా ఉండేనో. ఆ బాధని భరిస్తూ నిజంగా రొమాన్స్ చేస్తున్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆడియన్స్ కన్విన్స్ అయ్యేలా ఆ సీన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అంత సులభం కాదు. చూస్తున్న వారేమో ఆ వాళిద్దరూ రొమాన్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు లే అని అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు అని అనుప‌మ పేర్కొంది. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అనుప‌మ గ‌త సినిమాలో కూడా రొమాన్స్‌తో రెచ్చిపోయింది. అవ‌కాశాలు లేక ఈ భామ ఇలా చేస్తుంది అని అనేవారు కూడా లేక‌పోలేదు. టిల్లు స్క్వేర్ చిత్రం అనుపమకు సరికొత్త ఇమేజ్ ఇస్తుందని అంద‌రు భావిస్తుండ‌గా,రిలీజ్ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో చూడాలి. 

Exit mobile version