బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన సొట్ట బుగ్గల సుందరి అశ్విని. ఈమెపై సీరియల్ బ్యాచ్ డామినేట్ చేస్తున్నారని, ప్రతిసారి చెప్పుకొస్తుంటుంది. అయితే ఈ వారం అశ్విని ఎలిమినేట్ కానున్నట్టు తెలుస్తుంది. అశ్విని గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. పవన్ కళ్యాణ్‌ని చూస్తూ చపాతీ పిండి పిసికే సీన్‌లో ఈ అమ్మడు నటించి అదరగొట్టింది. అయితే షూటింగ్ సమయంలో తనకి పవన్ కళ్యాణ్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడనేది ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. పవన్ కళ్యాన్‌తో వర్క్ చేసిన తరువాతే నేను ఆయనకి ఫ్యాన్‌ని అయ్యాను. మనుషులు ఇలా ఉంటారా?? అని అనిపించింది.
సార్ సెట్స్‌లో నాతో చాలా బాగా ఉండేవారు. ఆయన తినే డ్రై ఫ్రూట్స్ నాకు ఇచ్చేవారు. ఆయనతో గడిపిన క్షణాలు నాకు చాలా స్వీట్ మెమొరీస్ అని పేర్కొంది. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్ను పిలిచి అశ్విని పాట పాడమ్మా అనేవారు. ఆయన చాలా ఫన్‌గా ఉంటారు. షూటింగ్‌కి రోజులో ఒక్కసారి మాత్రమే ఆయన తన కార్‌వ్యాన్‌లోకి పిలిచేవారు. కార్వాన్ సార్‌తో పాటే ఉండేదాన్ని. టైంకి తినడం కబుర్లు చెప్పుకోవడం.. ఊరికే ఫోన్లు చూసుకోవడం చేసేదాన్ని. నాకు ఎక్కువ టైం క్యారివాన్‌లో బోర్ కొడుతుందని.. సార్ నేను వెళ్లి కారులో కూర్చుంటా అని చెప్పాను. అప్పుడు ఆడెవడన్నా.. ఈడెవడన్నా సాంగ్ షూట్ నడుస్తుంది. ఫుల్ ఎండ ఉంది అప్పుడు.
అయితే 800 మంది ఆర్టిస్ట్‌లతో పాటు.. పవన్ కళ్యాణ్ సార్ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు. నన్ను ఆయన తిడతారేమోనని భయం వేసింది. భయపడుతూనే సార్ దగ్గరకు వెళ్లి.. సార్ సారీ అని అన్నాను. దానికి ఆయన.. ఇట్స్ ఓకే అశ్వినీ ఫస్ట్ నువ్ చిల్ అవ్వు.. సైలెంట్‌గా ఉండు అని సార్ నన్ను కూల్ చేశారు. నాకు అప్పుడు ఆయనలో దేవుడు కనిపించారు. ఆయన ఆడాళ్లకి రెస్పెక్ట్ ఇస్తారు. అది ఎలా చూపిస్తారో మాటల్లో చెప్పలేను. గబ్బర్ సింగ్ టైంలో సార్‌తో షూటింగ్ చేసి వెళ్లి పడుకున్న తరువాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు నాకు ఉన్నాయని అశ్విని పేర్కొంది. ఆయన సెట్స్‌లో ఏం తింటారో.. అక్కడ ఉండేవాళ్లందరికీ అదే ఫుడ్ పెట్టి కడుపు నింపుతారని అశ్విని గొప్పగా చెప్పుకొచ్చింది.