ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాతో ఆయనకి దేశ వ్యాప్తంగా క్రేజ్ దక్కింది. అతను నేషనల్ అవార్డ్ కూడా ఈ సినిమాతో దక్కించుకున్నాడు. ప్రస్తుతం పుష్ప2 చిత్రంతో బిజీగా ఉన్న బన్నీ ఈ మూవీతో మరిన్ని సంచలనాలు సృష్టిస్తాడని అందరు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్, సందీప్ వంగాలతో అల్లు అర్జున్ సినిమాలు చేసేందుకు కమిటయ్యాడు. ఈ ఇద్దరు దర్శకులతో పాటు మరికొందరు పాన్ ఇండియన్ డైరెక్టర్లతో కూడా బన్నీ సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతుంది.
తమిళ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ తమిళ సినిమాలు చేసిన యువ దర్శకుడు అట్లీ ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టాడు. బాలీవుడ్ బాద్ షా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న సమయంలో జవాన్ అనే చిత్రంతో పెద్ద హిట్ ఇచ్చాడు. ఈ సినిమాతో షారూఖ్ ఖాన్ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా వెయ్యి కోట్ల పైన వసూళ్లు సాధించింది. ఇక అట్లీకి టాలీవుడ్ హీరోతో సినిమా చేయనున్నాడంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అట్లీతో అల్లు అర్జున్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్, అట్లీ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
బన్నీ కోసం పలువురు దర్శకులు క్యూలో వెయిట్ చేస్తుండగా, ఏ దర్శకుడితో ఐకాన్ స్టార్ సినిమా చేస్తాడనేది చర్చనీయాంశంగా మారింది. సోషియా ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా, ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ కథను సిద్ధం చేయడానికి చాలా సమయం తీసుకోనున్నాడని చెబుతోన్నారు. త్రివిక్రమ్ మూవీ స్థానంలో అట్లీ మూవీని సెట్స్‌పైకి తీసుకురాలని బన్నీ ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం నగర్ సమాచారం. మరి రానున్న రోజులలో దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.