Site icon vidhaatha

ఆ టైమ్‌లో చిల్లి గ‌వ్వ‌లేక ఫ్యాన్‌కి ఉరేసుకొని చ‌నిపోదామ‌నుకున్న అవినాష్‌

బుల్లితెరపై ప్రసారమైనటువంటి జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ లభించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌త ప‌దకొండేళ్లుగా ఈ షో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇక ఈ షో ద్వారా చాలా మంది ఇప్పుడు రిచెస్ట్ లైఫ్ అనుభ‌విస్తున్నారు. వారిలో ముక్కు అవినాష్ కూడా ఒక‌రు. జ‌బ‌ర్ధ‌స్త్‌లో క‌మెడీయ‌న్‌గా స‌త్తా చాటిన అవినాష్‌కి బిగ్ బాస్ అవ‌కాశం ద‌క్కింది. దాంతో ఆయ‌న జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. ఈ షో త‌ర్వాత అవినాష్ లైఫ్ మారిపోయింది. అయితే అంతకు ముందు అవినాష్ కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉండేదట. ఈ విషయాన్ని స్వయంగా అవినాష్ సోదరుడు అజయ్ ఓ ఇంటర్వ్యూలో తెలియ‌జేశాడు.

లాక్ డౌన్ ముందు వరకు పరిస్థితి మంచిగానే ఉండేది. అప్పులు ఉన్నా ఎలాగోలా ఇంటిని నడిపించేవాడు అన్నాడు. కానీ లాక్ డౌన్ లో షూటింగ్స్ ఆగిపోయాయి. దీనితో చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయిపోయింది. ఈఎమ్ఐలు కట్టమని నోటీసులు వచ్చేవి.అవికాక బయట అప్పులు కూడా ఉన్నాయ్ దాంతో అన్న చాలా కుంగిపోయాడు. నిద్ర పోకుండా వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడు. క‌నీసం 5 గంటలు కూడా నిద్ర‌పోయేవాడు కాదు.డ‌బ్బుల గురించి వాటి వ‌ల్ల ఎదుర‌య్యే ప్రెష‌ర్ గురించి మాత్ర‌మే ఆలోచించేవాడు. ఒకానొక సంద‌ర్భంలో అప్పుల వ‌ల‌న ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవాల‌ని అనుకున్నాడ‌ట‌.

ఇక బిగ్ బాస్ ఆఫ‌ర్ రావ‌డంతో జ‌బ‌ర్ధ‌స్త్ నుండి బ‌య‌ట‌కు రావ‌డానికి రూ.10 ల‌క్ష‌లు క‌ట్టాలి. ఆ స‌మ‌యంలో శ్రీముఖి దగ్గర 5 లక్షలు, గెటప్ శ్రీను దగ్గర ఒక లక్ష, చమ్మక్ చంద్ర దగ్గర రెండు లక్షలు అప్పు చేసి అవి జబర్దస్త్ కు కట్టాడు. దేవుడి దయవల్ల బిగ్ బాస్ తర్వాత అన్నయ్య కెరీర్ బావుంది అని అవినాష్ సోదరుడు అజయ్ తెలిపాడు. లాక్ డౌన్ లోనే తన తండ్రికి, అమ్మకి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు అవినాష్ ఒక సందర్భంలో చెప్పుకురావ‌డం మ‌నకు తెలిసిందే.మొత్తానికి లాక్‌డౌన్‌లో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డ అవినాష్‌కి శ్రీముఖి చాలా సపోర్ట్‌గా నిలిచింద‌నే చెప్పాలి

Exit mobile version