Site icon vidhaatha

అయోధ్య రామ మందిర ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం అందుకున్న 18 తార‌లు వీరే..!

అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మాణం చేపడితే బాగుంటుంద‌ని ఎంతో మంది క‌ల‌లు కన్నారు. వారి క‌ల‌లు త్వ‌ర‌లోనే నిజం కానుంది. వచ్చే నెలలో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానుంది. నూతన సంవత్సరంలోని 22 జనవరి కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎదురు చూస్తున్న‌రు. రామమందిర ప్రారంభాన్ని రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయోధ్యను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం తొలి వంద రోజులు ఏకంగా 1000కిపైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 19 నుండ ఈ రైళ్లు అందుబాటులోకి రానుండ‌గా, దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఇవన్నీ అయోధ్యకు పరుగులు తీయనున్నాయి. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుండగా, 23న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుంది. అదే రోజు నుంచి భక్తులకు ఆలయ దర్శనం అందుబాటులోకి రానుంది.

అయితే రామ మందిర ప్రారంభోత్స‌వాన్ని పెద్ద ఎత్తున చేస్తుండ‌గా, ఆ రోజు కోసం ప్ర‌త్యేక సన్నాహాలు చేస్తున్నారు. శాంతి భద్రతలతో పాటు భక్తులకు సౌకర్యాల కల్పన, మతపరమైన కార్యక్రమాలపై పూర్తి దృష్టి పెడుతున్నారు. ఇక‌ ఈ వేడుకలో రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల సహా అనేక మంది పాల్గొనబోతున్నారు. రామమందిరం ప్రారంభోత్సవంలో బాలీవుడ్ పరిశ్రమతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి కూడా అనేక మంది స్టార్ నటీనటులు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం ద‌క్కిన‌ట్టు తెలుస్తుంది.

మొత్తం 18 మంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తుండ‌గా,తాజా స‌మాచారం ప్ర‌కారం అమితాబ్ బచ్చన్ , మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్ ,సంజయ్‌ లీలా భన్సాలీ వంటి వారు ఉన్నట్టు ఓ నివేదిక బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాజ్‌కుమార్ హిరానీకి కూడా ఆహ్వానం ద‌క్కిన‌ట్టు స‌మాచారం. అలానే రోహిత్ శెట్టితో పాటు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ఆహ్వానించింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ నుండి ఎవ‌రికి ఆహ్వానం ద‌క్కుతుందో చూడాలి. అయితే ఈ జాబితాలో కంగనా రనౌత్ పేరు లేకపోవడం విశేషం.

Exit mobile version