నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయం సాధిస్తుంది. అలానే ఆయన హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో టాప్ రేటింగ్‌లు సాధిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక త్వరలో బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 999 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నట్టు సమాచారం. అయితే బాలయ్య సినిమాలతో పాటు ఆయనపై కూడా అభిమానులు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఎప్పటికప్పుడు బాలయ్యకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలని బయటకు లాగుతుంటారు.
తాజాగా బాలకృష్ణ ఓ చిత్రానికి కెమెరామెన్‌గా కూడా పని చేశాడనే వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. వివరాలలోకి వెళితే బాలయ్య తన కెరియర్ మొదట్లో తండ్రి చిత్రాలలోనే ఎక్కువగా నటించాడు. తర్వాత తర్వాత సోలోగా నటించాడు.అయితే సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రాలలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చిత్రం కూడా ఒకటి.ఈ చిత్రంలో అన్న ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషించగా అతడు భక్తుడు అయిన సిద్ధప్ప పాత్రలో బాలయ్య నటించి మెప్పించాడు.ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు నాలుగు కోట్ల రూపాయలను అప్పట్లోనే ఈ కొల్లగొట్టింది
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా విడుదల సమయానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా కూడా సెన్సార్ బోర్డు వారి అభ్యంతరాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత మాత్రం పెద్ద హిట్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్.. చిత్రానికి దర్శకత్వం వహిస్తూ తన కొడుకు బాలకృష్ణకి కొన్ని మెలకువలు నేర్పించారట. బాలయ్య కొన్ని షాట్స్‌కి కెమెరామెన్‌గా వ్యవహరించి షూట్ చేశారట. ఇలా బాలయ్య తన కెరియర్‌లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమాకి కెమెరా మెన్‌గా కూడా పని చేశారన్నమాట.