నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఒక్కోసారి విచిత్రమైన పనులు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. బాలయ్యకి ప్రేమ, కోపం రెండు ఎక్కువే. వాటిని అందరిముందు చూపించడానికి ఏ మాత్రం వెనకాడడు. కోపం వస్తే ఎలాంటి పెద్ద ఈవెంట్‌లో అయిన చెంపచెళ్లుమనిపిస్తాడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . ముఖాన ఒక మాట ముఖం వెనక ఒక మాట మాట్లాడే తత్వం మన బాలయ్యది అస్సలు కాదు . రీసెంట్ గా బాలయ్యకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కాగా, ఇందులో బాలయ్యకి ఓ వ్యక్తి బొకే అందించగా, దానిని విసిరి అవతల పడేశాడు.
ప్రస్తుతం నందమూరి బాలయ్య తన నియోజకవర్గమైన హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోని ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. బాలయ్య కోసం ఎంతోమంది అభిమానులు తరలి రాగా, వాళ్ళను చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించాడు … అయితే ఒక అభిమాని బాలయ్య కోసం బొకే తెచ్చి ఆయనకి ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ ఉంటాడు. దీంతో కోపం వచ్చిన బాలయ్య ఏంటి అటూ ఇటూ చూస్తున్నావు .. అనగానే ఆ వ్యక్తి బొకే ఇస్తాడు. ఆ బొకే తీసుకొని ఆయన ముందే విసిరి పరేస్తాడు బాలయ్య. ఈ వీడియోని అక్కడ ఎవరో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ ట్రోల్ అవుతుంది. బాలయ్య తో పరాచకాలు ఆడితే ఇలానే ఉంటుంది అంటూ వీడియోకి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
హిందూపురం టౌన్, రూరల్ మండలాల్లో సమస్యలు, కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు బాలయ్య. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయటంలో భాగంగా ఇప్పటికే చిలమత్తూరు, లేపాక్షి మండలాల కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. ఇటీవల దివ్యాంగుడైన రామాంజనేయ నాయుడిని ఎమ్మెల్యే బాలయ్య ఆప్యాయంగా పలకరించారు. ఆయన శాలువా కప్పేందుకు ప్రయత్నించగా బాలకృష్ణ మోకాళ్లపై కూర్చుని దాన్ని స్వీకరించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అతనికి అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఆయనంతే..ఆయన స్టైల్ అంతే pic.twitter.com/lKhjbbVdbj
— Actual India (@ActualIndia) January 9, 2024