ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మంచి సక్సెస్‌లు సాధిస్తూ అన్నగారి పేరు నిలబెడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఎన్టీఆర్, బాలయ్య ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎన్టీఆర్ స్పందించలేదు. ఆ విషయంలో బాలయ్య ఎవరు స్పందించిన స్పందించకపోయిన `ఐ డోన్ట్ కేర్` అంటూ కామెంట్ చేశారు బాలకృష్ణ. ఇక రీసెంట్‌గా `భగవంత్ కేసరి` చిత్ర సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్ జరగగా, ఈ ఈవెంట్‌లో బాలయ్య పలు హాట్ కామెంట్లు చేశారు.నన్ను ఎవరైనా బాబాయ్ అంటే వాళ్లకి దబిడి దిబిడే అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్‌ని ఉద్దేశించాడనే సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తుంది. పరోక్షంగా తారక్‌ని ఉద్దేశించే బాలయ్య కామెంట్ చేశాడని సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏదో సరదాగా బాలయ్య అలా అన్నాడని మరీ అంత డీప్‌గా వెళ్లాల్సిన పనిలేదని అంటున్నారు. ఏదేమైన బాలయ్య డైలాగ్ మీనింగ్ మాత్రం అబ్బాయ్ తారక్‌కి సింక్ అయ్యేలా ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఈ దెబ్బతో పూర్తిగా బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెపరేట్ అయ్యారని అంటున్నారు. సోషల్ మీడియాలో వారి మధ్య వార్ చూస్తుంటే ఇది నిజమనే అభిప్రాయం కూడా కలుగుతుంది.
భగవంత్ కేసరి` మూవీ సమయలో తారక్ ఫ్యాన్స్ ఆ సినిమాని సపోర్ట్ చేయలేదనే టాక్ కూడా ఉంది. అందుకే కలెక్షన్స్ కూడా సరిగ్గా రాబట్టలేకపోయిందని కొందరి వాదన.ఏది ఏమైన ఇలాంటి విషయాలలో అభిమానులే ఎక్కువగా ఆలోచించి డిస్ట్రబ్ అవుతారే తప్ప చివరికి వారిద్దరు కలిసి మంచిగానే ఉంటారు. కాబట్టి ఈ ఇష్యూపై అంతగా ఫోకస్ పెట్టొద్దు అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దక్కిన విషయం తెలిసిందే.