Site icon vidhaatha

నామినేష‌న్ల ర‌చ్చ‌… హీటెక్కిపోయిన బిగ్ బాస్ హౌజ్

బిగ్ బాస్ సీజ‌న్ 7లో 11వ వారం నామినేష‌న్స్ హీటెక్కాయి.ప‌లు పాయింట్ల గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ హోరెత్తిపోయేలా చేశారు కంటెస్టెంట్స్ . సోమ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లుకాగా, ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్లాలో తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. శివాజీ కెప్టెన్ అయిన కార‌ణంగా ఆయ‌న‌ని ఎవ‌రు నామినేట్ చేసేందుకు వీలు లేద‌ని బిగ్ ఆబాస్ అన్నారు. శివాజీ హౌస్ కెప్టెన్ కాగా అతన్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదన్నారు. అయితే ముందుగా సోమవారం నామినేష‌న్స్ ముందుగా ర‌తికతో ప్రారంభం కాగా, ఆమె శోభాశెట్టి- ప్రియాంక‌ల‌ని నామినేట్ చేస్తూ లెఫ్ట్ అండ్ రైట ఇచ్చి ప‌డేసిది. ఇక ప్ర‌శాంత్- అర్జున్ మ‌ధ్య కూడా చిన్న‌పాటి వార్ న‌డిచింది.

ఇక మంగ‌ళ‌వారం నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో శోభా శెట్టి – పల్లవి ప్రశాంత్ ల మధ్య కూడా చిన్న‌పాటి ర‌చ్చే జ‌రిగింది. ఇక అశ్విని.. అమర్, ప్రియాంకలను నామినేట్ చేయ‌గా, ఎప్ప‌టి మాదిరిగానే అశ్విని- ప్రియాంక‌ల మ‌ధ్య వార్ న‌డిచింది.మ‌రో నామినేష‌న్‌లో యావర్.. అమర్ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకున్నారు. కేవలం స్ప్రైట్ కోసం నన్ను యావర్ నామినేట్ చేశాడని అమ‌ర్ అన‌గా, నీ బిహేవియర్ కి చేశానని యావర్ చెప్పుకొచ్చాడు. ఇద్దరు కూడా తెగ ఊగిపోగా, వారిద్ద‌రిని శివాజీ శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక శోభ యావర్ ను, అశ్వినీని నామినేట్ చేయగా.. ఈ ఇద్దరితో శోభ గట్టిగానే వాదించింది. మొత్తానికి నామినేష‌న్ ప్ర‌క్రియ‌తో బిగ్ బాస్ హౌజ్ ఫుల్ హీటెక్కింద‌ని చెప్పాలి.

నామినేష‌న్ ప్రక్రియ పూర్తైన త‌ర్వాత దివాళి సందర్భంగా డాన్స్ లతో ర‌చ్చ చేశారు హౌస్ మెంబర్స్. అయితే నామినేషన్స్ కు సబంధించిన వేవ్స్ ఆనైట్ అంతా కొనసాగాయి. యావర్ కు, పల్లవిప్రశాంత్ కు శివాజీ హిత బోద చేయగా.. అమర్ ప్రియాంక మధ్య నామినేషన్స్ కు సంబధించి చ‌ర్చ జ‌రిగింది. మొత్తానికి ఈ వారం 1. ప్రియాంక 2. యావర్ 3. అమర్ దీప్ 4. గౌతమ్ 5. శోభా శెట్టి 6. అశ్విని 7. రతిక 8. అర్జున్ నామినేష‌న్స్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. వీరిలో ఒక‌రు బిగ్ బాస్ హౌజ్ వీడ‌నున్న‌ట్టు స‌మాచారం. 

Exit mobile version