Site icon vidhaatha

న‌మ్ర‌తా బ‌ర్త్ డే పార్టీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నారా బ్రాహ్మ‌ణి.. ఉపాస‌న మిస్ అయిందేంటి..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి, ఒకప్ప‌టి హీరోయిన్ న‌మ్ర‌తా శిరోద్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. మిస్ యూనివ‌ర్స్‌గా కూడా స‌త్తా చాటిన న‌మ్ర‌త ఎందుకో పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి దూర‌మైంది. మ‌హేష్‌, పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూ గ‌డుపుతుంది. అయితే న‌మ్ర‌త సినిమాలు చేయ‌క‌పోయిన కూడా అంద‌రి అటెన్ష‌న్‌ని ఏదో విధంగా గ్రాబ్ చేస్తూ ఉంటుంది. ఇక సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కి సంబంధించిన విష‌యాల‌తో పాటు ఫ్యామిలీ విష‌యాల‌ను కూడా షేర్ చేస్తుంది. అడ‌పాద‌డ‌పా మ‌హేష్ ఫ్యామిలీ అంతా టూర్స్ కి వెళుతుండ‌గా, అందుకు సంబంధించిన అప్‌డేట్స్‌ని న‌మ్ర‌తా అందిస్తూ ఉంటుంది.


అయితే జ‌న‌వ‌రి 22న న‌మ్ర‌త‌ తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. మహేష్ ప్రస్తుతం జర్మనీలో ఉండగా ఆమె త‌న ఫ్రెండ్స్‌తో బ‌ర్త్‌డేని జ‌రుపుకుంది. తన బర్త్ డే నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ ప్లేస్ లో నమ్రత తన బర్త్ డే పార్టీ ఏర్పాటు చేయ‌గా, ఈ ఈవెంట్‌కి ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ పార్టీకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా ఇందులో మంజుల‌, మహేష్ ఇంకో అక్క, సుధీర్ బాబు భార్య, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, పలువురు ఫ్యాషన్ డిజైనర్లు.. మరికొంతమంది నమ్రత ఫ్రెండ్స్ కూడా సంద‌డి చేశారు. అయితే ఈ పార్టీకి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కూడా హాజ‌రు కావడం విశేషం. అయితే న‌మ్ర‌త ఇటు సినీ సెల‌బ్స్‌, రాజ‌కీయ నాయ‌కుల స‌తీమ‌ణుల‌ని క‌వ‌ర్ చేస్తుండ‌డం చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. అయితే ఈ పార్టీలో రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న మిస్ కావ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. న‌మ్ర‌త ఇచ్చే పార్టీల‌లో త‌ప్ప‌క ఉపాస‌న ఉంటుంది. కాని ఈ సారి ఆమె ఎందుకు మిస్ అయిందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు


మ‌హేష్ బాబు ఈ సారి న‌మ్ర‌త బ‌ర్త్‌డేకి లేని నేప‌థ్యంలో ఆమె లేడీస్‌తో క‌లిసి త‌న బ‌ర్త్‌డేని ఘ‌నంగా జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే మహేష్ బాబు ప్రస్తుతం జర్మనీలో ఉండగా.. సోషల్ మీడియా వేదికగా నమ్రతకు బర్త్‌డే విషెష్ చెప్పారు. ఆమెతో దిగిన రొమాంటిక్ పిక్ షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మ‌హేష్ బాబు రాజమౌళి సినిమా పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంతో మ‌హేష్ బాబు రేంజ్ పీక్స్‌కి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Exit mobile version