Site icon vidhaatha

మ‌ళ్లీ తెర‌పైకి ఐశ్వ‌ర్య‌రాయ్, అభిషేక్ డివోర్స్.. వారిద్ద‌రు విడివిడిగా ఉంటున్నారా..!

ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల విడాకుల వార్త‌లు ఎక్కువ‌గా వింటున్నాం. ఏవో కార‌ణాల వ‌ల‌న ఇద్ద‌రి మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డం, ఇద్ద‌రు దూరంగా ఉండ‌డం, కొన్ని రోజుల‌కి విడాకులు తీసుకుంటుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గత కొద్ది రోజులుగా బాలీవుడ్ క్రేజీ క‌పుల్‌ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. గ‌తంలో వీరి విడాకుల గురించి ప్ర‌చారాలు సాగ‌గా, ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు క‌లిసి బ‌య‌ట క‌నిపించ‌డంతో వాటికి చెక్ ప‌డింది. కాని ఇప్పుడు మ‌ళ్లీ వారి విడాకుల వ్య‌వహారం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

ఇటీవల ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు జరగగా, ఆ వేడుక‌లో ఐశ్వర్యతో పాటు ఆమె తల్లి, కూతురు మాత్రమే క‌నిపించారు. మ‌రోవైపు ఐష్ పుట్టినరోజు సందర్భంగా అభిషేక్ గూగుల్‌లో ఐశ్వర్య ఫోటో సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసి పోస్ట్ పెట్టాడు. ఇంత‌లోనే ఓ పాత ఇంట‌ర్వ్యూ కూడా వైర‌ల్ అయింది. వీట‌న్నింటిని క‌ల‌గలిపి వీరిద్ద‌రు విడాకులు సిద్ధ‌మ‌య్యారంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఐష్ మాట్లాడుతూ.. నేను, అభి రోజూ గొడ‌వ‌ప‌డ‌తున్నాం. మా మ‌ధ్య కొన్ని అభిప్రాయబేధాలు ఉన్నాయి. అవి త్వ‌ర‌లో ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. అవి లేక‌పోతే జీవితం బోరింగ్‌గా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అంటే అవి స‌మ‌సిపోక‌పోవ‌డం వ‌ల్ల‌నే అభిషేక్, ఐశ్వర్య మధ్య విభేదాలు విడాకుల దాకా వెళ్లాయని అంటున్నారు.

ఇక ఫేక్ ట్వీట్స్‌తో అందరిని టెన్షన్ పెట్టే ఉమైర్ సంధు తాజాగా త‌న ట్వీట్‌లో ‘అభిషేక్-ఐశ్వర్య అధికారికంగా విడాకులు తీసుకున్నారని’ ఉమైర్ ట్వీట్ చేశాడు. దీనిని జనం సీరియస్‌గా తీసుకోలేదు. కాని ఇది చూసే స‌రికి ఒక్క‌సారి షాక్ అవుతున్నారు. ఇక ఐశ్వర్య రాయ్ ‘ధూమ్2’ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ ప్రేమ‌లో ప‌డ‌గా, 14 జనవరి 2007న వారి నిశ్చితార్ధం జరిగింది. 20 ఏప్రిల్ 2007న ముంబైలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక 2011 నవంబర్ 16న వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. త్వ‌ర‌లో ఈ చిన్నారిని కూడా వెండితెర‌కి పరిచ‌యం చేయాల‌ని అనుకుంటున్నారు.

Exit mobile version