Site icon vidhaatha

బ‌న్నీ భామ అందాల‌పై స్పాట్ లైట్.. ఆ అందాల‌కి థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన స‌రైనోడు చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా న‌టించి అలరించింది కేథరిన్ థెస్రా. లేడి ఎమ్మెల్యేగా త‌న న‌ట‌న‌తో పాటు అందంతోను అద‌ర‌గొట్టింది. స‌రైనోడు సినిమా త‌ర్వాత కేథ‌రిన్‌ని చాలా మంది లేడి ఎమ్మెల్యేగానే పిలుస్తున్నారు. అయితే కేథ‌రిన్‌కి అందం, అభిన‌యం ఉన్నా కూడా ఎందుకో స‌రైన అవ‌కాశాలు ద‌క్కించుకోలేక‌పోతుంది. కేథరిన్ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోవ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలే చేసింది కాని అవ‌న్ని బెడిసి కొట్టాయి. ఇటీవ‌లి కాలంలో కేథ‌రిన్ సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.

కేథరిన్ చమ్మక్ చల్లో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌గా, ఆ చిత్రం 2013లో విడుదలయింది. అదే ఏడాది అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాకి డివైట్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇందులో కేథరిన్ లుక్స్, డాన్సులు చూసి తప్పకుండా ఆమెకి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని అంద‌రు భావించారు. అల్లు అర్జున్ వేగాన్ని అందుకుంటూ ఆమె డ్యాన్స్ చేసిన విధానం ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకునేలా చేసింది. అయితే కేథ‌రిన్ కి పరాజయాలు ఎదురుకావడంతో పోటీలో వెనుకబడింది. కేథరిన్ అందరి హీరోయిన్ల లాగా నాజూకు గ్లామర్ మైంటైన్ చేయదు. బొద్దుగా ఉంటూనే యువతని ఆకర్షిస్తోంది.

సరైనోడు చిత్రం తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయజనాకి నాయక , బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య లాంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల‌లో ఏది కూడా కేథ‌రిన్‌కి పెద్ద‌గా స‌క్సెస్ అందించ‌లేదు. మాములుగానే కేథరిన్ గ్లామ‌ర్‌కి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతుంటారు. తాజాగా త‌న అందాల‌పై స్పాట్ లైట్ పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసే ఎద సోయగాలతో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. కాల్చేసే చూపులతో కసిగా ఈ అందాల భామ చేస్తున్న అందాల అరాచకం న‌భూతో న‌భవిష్య‌త్ అని చెప్పాలి. ప్ర‌స్తుతం కేథరిన్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో యువతని ఆకట్టుకునే విధంగా గ్లామర్ ఒలకబోస్తూ డైరెక్టర్స్, నిర్మాతలని కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న కేథ‌రిన్ రానున్న రోజుల‌లో అయిన స్టార్ హీరోయిన్‌గా ఎద‌గాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు.

Exit mobile version