Site icon vidhaatha

నిహారిక ఇంట‌ర్వ్యూపై నిప్పులు చెరిగిన మాజీ భర్త‌.. మ‌ళ్లీ రాజుకున్న వివాదం

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక సినిమాల‌లోకి రాక ముందు ప‌లు వెబ్ సిరీస్‌లు చేసి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఒక మ‌న‌సు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత కూడా పలు సినిమాలు చేసింది. ఏ చిత్రం కూడా మంచి విజ‌యం అందించ‌లేక‌పోయింది. అయితే సినిమాలు క‌లిసి రాక‌పోవ‌డంతో చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకొని ఏడాది పాటు సంసారం చేసింది. గత ఏడాది అన‌కోని కార‌ణాల వ‌ల‌న వీరిద్ద‌రు విడాకులు తీసుకుని విడిపోయారు. అంతకు ముందు వీరిద్దరి పర్సనల్ లైఫ్ లో విభేదాలు మొదలైనట్లు ఎన్నో రూమర్స్ రాగా, చివ‌రికి అవే నిజ‌మ‌య్యాయి. అయితే నిహారిక, చైతన్య విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇప్ప‌టి వ‌ర‌కు బయటకి రాలేదు.

అయితే రీసెంట్‌గా నిహారిక ఓ ఇంట‌ర్వ్యూలో త‌న భ‌ర్త‌తో విడిపోవ‌డానికి దారి తీసిన ప‌రిస్థితుల గురించి వివ‌రించింది. యాంకర్ నిఖిల్ తో జరిగిన ఇంటర్వ్యూలో నిహారిక.. చైతన్య నుంచి విడిపోవడానికి గల కారణాలు చెబుతూ అత్తింటి వారు తనపై ఆంక్షలు విధించడమే విడాకులకు కారణం అన్నట్లుగా ఓపెన్ అయింది. పెళ్లి తర్వాత నటించకూడదా ? మీరు రాంగ్ పర్సన్ పై డిపెండ్ కాకూడదు.. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ అమ్మానాన్న కాలేరు. అంత డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేసుకుని ఎవ్వరూ ఊరకనే విడిపోరు అంటూ నిహారిక కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఇక హోస్ట్ నిఖిల్ ఇంట‌ర్వ్యూకి సంబంధించి ఓ పోస్ట్ చేశాడు. దానికి చైతన్య జొన్నలగడ్డ స్పందిస్తూ హాట్ హాట్ కామెంట్ చేశాడు.

‘హాయ్‌ నిఖిల్‌. నిహారిక ఎదుర్కొంటున్న పరిస్థితిని దూరం చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. వ్యక్తిగతంగా దూషిస్తూ జరుగుతున్న దుష్ప్రచారం ఎదుర్కోవ‌డం అంత ఈజీ కాదు. అయితే ఇలా చేసేప్పుడు దానికి కార‌ణ‌మైన వారి ట్యాగ్‌లు కంట్రోల్ చేయాలి. ఇలా జ‌ర‌గ‌డం రెండోసారి. విడాకుల విష‌యంపై ఒక‌రి వైపు నుండే మాట్లాడ‌కూడ‌దు. రెండు వైపులా ఆ బాధ, కష్టం ఒకేలా ఉంటుంది. ఎలా కోలుకున్నామనే విషయంపై మాట్లాడితే అందరికీ ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పిస్తే బాగుంటుంది. ఏం జ‌రిగిందో తెలియ‌కుండా ఇలాంటి వేదిక‌ల ద్వారా ఒక్క కోణంలోనే చెప్ప‌డం చాలా త‌ప్పు. ఇది నువ్వు అర్ధం చేసుకుంటావ‌ని ఆశిస్తున్నాన‌ని జొన్న‌ల‌గ‌డ్డ త‌న పోస్ట్ ద్వారా తెలియ‌జేశాడు. 

Exit mobile version