బ‌ట‌ర్ చికెన్‌ను మించిపోయేలా బాదం చికెన్.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది..!

బ‌టర్ చికెన్‌ను మించిపోయేలా బాదం చికెన్ త‌యారు చేసుకోవ‌చ్చు. కొంద‌రికి బ‌ట‌ర్, పాల ఉత్ప‌త్తులు ప‌డ‌వు. అలాంటి వారు బాదం చికెన్‌ను త‌యారు చేసుకోవ‌డం మంచిది. గ్రేవి కూడా స‌రిపోయినంత వ‌స్తుంది. టేస్టీ కూడా సూప‌ర్‌గా ఉంటోంది.

  • Publish Date - March 24, 2024 / 12:57 AM IST

ఆదివారం రోజు నాన్ వెజ్ ప్రియులు చికెన్, మ‌ట‌న్, చేప‌లు, రొయ్య‌లు ఆరంగించేందుకు ఆస‌క్తి చూపిస్తారు. ఇక పొద్దున్నే మార్కెట్‌కు వెళ్లి త‌మ‌కు ఇష్ట‌మైన నాన్ వెజ్ ఐటెమ్‌ను తీసుకొచ్చుకుంటారు. చాలా మంది చికెన్‌పై మ‌క్కువ చూపిస్తారు. ఇక ఈ చికెన్‌ను ర‌క‌ర‌కాలుగా వండేందుకు ట్రై చేస్తుంటారు. అయితే బ‌టర్ చికెన్‌ను మించిపోయేలా బాదం చికెన్ త‌యారు చేసుకోవ‌చ్చు. కొంద‌రికి బ‌ట‌ర్, పాల ఉత్ప‌త్తులు ప‌డ‌వు. అలాంటి వారు బాదం చికెన్‌ను త‌యారు చేసుకోవ‌డం మంచిది. గ్రేవి కూడా స‌రిపోయినంత వ‌స్తుంది. టేస్టీ కూడా సూప‌ర్‌గా ఉంటోంది. బాదం ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక ఈ బాదం చికెన్‌ను అన్నంతో లేదా చ‌పాతీతో క‌లిపి తీసుకోవ‌చ్చు. మ‌రి బాదం చికెన్ త‌యారీకి ఏం కావాలో తెలుసుకుందాం..

బాదం చికెన్ త‌యారీకి కావాల్సిన ప‌దార్థాలు

చికెన్ – హాఫ్ కేజీ(బోన్‌లెస్‌), బాదం – 10 గింజ‌లు, ట‌మాటాలు -2, ఉల్లిపాయ‌లు – త‌రిగిన‌వి అర‌కప్పు, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, కారం – 1 టీ స్పూన్, గరం మాసాలా – అర టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, బిర్యానీ ఆకులు – 3, లవంగాలు – 4, యాలకులు -3, దాల్చిన చెక్క – 1 అంగుళం, ఉప్పు త‌గినంత‌, కొత్తిమీర – ఒక క‌ట్ట‌.

త‌యారీ విధానం ఇలా..

ముందుగా చికెన్‌ను శుభ్రంగా క‌డ‌గాలి. ఆ త‌ర్వాత పెరుగుతో మారినేట్ చేసుకోవాలి. అనంత‌రం ఆ చికెన్‌కు అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. ఈ చికెన్ మిశ్ర‌మాన్ని అరగంట పాటు ఓ పాత్ర‌లో క‌ప్పి ఉంచాలి. వీలైతే ఫ్రిజ్‌లో ఉంచ‌డం బెట‌ర్. ఇక బాదంపై ఉన్న పీల్ తీసేసి మిక్సితో పేస్ట్ చేయాలి.

అరగంట అయ్యాక స్టౌవ్ వెలిగించి, పాత్ర‌లో రెండు టీ స్పూన్ల వేయాలి. అది వేడి అయిన త‌ర్వాత ఉల్లిపాయాలు వేయాలి. మాసాల దినుసులు కూడా వేసి, కాసేపు వేయించాలి. అనంత‌రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవ‌న్నీ వేగిన త‌ర్వాత ట‌మాటా ముక్క‌లు వేసి మ‌గ్గ‌నివ్వాలి. వీట‌న్నింటిని మిక్సీలో పేస్ట్ రూపంలో త‌యారు చేయాలి.

మ‌ళ్లీ మ‌రో పాత్ర‌లో నూనె పోసి వేడి చేయాలి. అప్పుడు మారినేట్ చేసిన చికెన్‌ను వేయాలి. చికెన్ ముక్క‌లు గోల్డెన్ క‌ల‌ర్‌లో వ‌చ్చిన త‌ర్వ‌తా దాన్ని మిక్సీలో చేసుకున్న ట‌మాటా, ఇత‌ర దినుసుల పేస్ట్‌ను వేయాలి. ఇక కారం, ధ‌నియాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని బాగా ఉడ‌క‌నివ్వాలి. గ్రేవీ కాస్త రెడ్​ కలర్ వస్తున్నప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ వేయండి. దీనిని బాగా కలిపి మరోసారి ఉడికించండి.

చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత దానిలో గరం మసాలా వేసి మరోసారి తిప్పండి. చివరిగా కొత్తిమీర వేసుకుని స్టౌవ్ ఆపేయండి. అంతే వేడి వేడి బాదం చికెన్ రెడీ. దీనిని మీరు రోటీలు, రైస్​లో కూడా కలిపి తీసుకోవచ్చు. బటర్ అంటే ఇష్టం లేని వారు హాయిగా దీనిని తయారు చేసుకుని చికెన్​ను ఎంజాయ్ చేయవచ్చు. 

Latest News