టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా నిలిచి ఎంతోమంది అభిమానుల మనసులని గెలుచుకున్నాడు చిరంజీవి. ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో కొనసాగుతూ టాలీవుడ్ టాప్ హీరోలలో మొదటి స్థానంలో ఉన్న ఆయన ఇప్పటికీ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చిరు చాలా మంది హీరోయిన్స్‌తో కలిసి నటించాడు. అలనాటి తార రాధ , టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సినీ నటి రాధిక శరత్ కుమార్,సుహాసిని, తమిళ నటి సిమ్రాన్, సుమలత ఎంతో మంది స్టార్ హీరోయిన్స్‌తో కలిసి పని చేశారు చిరు. చిరంజీవి సరసన నటించిన హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగారు.
అయితే హీరోయిన్ విషయంలో చిరంజీవి గొప్పతనాన్ని తెలియజేసే పాత వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. 2020 సంవత్సరంలో వీడియో అయిన కూడా చిరు రియల్ లైఫ్ హీరోయిజాన్ని తెలియజేసేందుకు ఇప్పుడు తెగ వైరల్ చేస్తున్నారు. కరోనా సమయంలో సుహాసిని చిరంజీవికి వీడియో కాల్ చేసింది. చిరు వీడియో కాల్‌లో ఉండగానే.. ఆయన గురించి ఆడియన్స్‌కి సుహాసిని గొప్పగా చెప్పారు. కేరళలో షూటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను చెప్పుకొచ్చారు. కేరళలోని అథిరపల్లిలో షూటింగ్ చేస్తున్నాం. మీరు ముందు కారులో ఉన్నారు. నేను, నా హెయిర్ డ్రెస్సర్, డాన్స్ మాస్టర్ తార వెనక కారులో ఉన్నాం. కొంత మంది తాగుబోతులు మా కారును అడ్డుకుని బీరు బాటిళ్లు విసిరిన విషయం మీకు గుర్తుందా?’ అని లైవ్‌లో చిరంజీవిని సుహాసిని అడిగారు.
గుర్తుంది.. అప్పుడు ‘నేను నా పిస్టల్ బయటికి తీశాను’ అని చిరంజీవి చెప్పారు. అది లైసెన్సెడ్ గన్ అని సుహాసిని అనగా, తాగుబోతులు తన కారుపైకి బీరు బాటిళ్లు విసరడంతో చిరంజీవి వెంటనే గన్ తీసి వారిని బెదిరించారని చెప్పుకొచ్చింది. చిరంజీవితో పాటు ఉన్న యూనిట్ బాయ్స్ కూడా అప్పుడు రంగంలోకి వారిని చితకబాదారట. అయితే హీరోయిజం అంటే కెమెరా ముందు చేసేది కాదని.. కెమెరా వెనక కూడా చేసేదని, అలాంటి రియల్ హీరో మా చిరంజీవి అంటూ సుహాసిని చాలా గర్వంగా చెప్పుకొచ్చింది. సుమారు మూడేళ్ల క్రితం నాటి వీడియోను ఇప్పుడు చిరంజీవి అభిమానులు బయటికి తీయడానికి కారణం.. నందమూరి అభిమానులకు కౌంటర్ ఇవ్వడానికే అని అర్ధమవుతుంది. రీసెంట్‌గా బాలయ్యపై బిగ్ బాస్ భామ పలు ఆరోపణలు చేయడంతో ఇప్పుడు చిరు గొప్పదనం తెలిసేలా ఆ వీడియోని స్ప్రెడ్ చేస్తున్నారు.