Site icon vidhaatha

అయోధ్య‌లో ల్యాండ్ అయిన రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి.. ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు..!

నేడు అయోధ్య‌లో రాముడి ప్రాణ ప్రతిష్ట జ‌ర‌గ‌నున్న‌ నేపథ్యంలో ఒక్క రోజు ముందే అక్కడికి చేరుకున్నారు ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు. కొంద‌రు అయితే ఆల‌య ప‌రిస‌రాల‌ని శుభ్రం చేయ‌డం కూడా మ‌నం చూశాం. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ రాముడి సేవలో నిమగ్నమైంది. ఓ వైపు ఆలయాన్ని శుభ్రం చేస్తూ మరోవైపు ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే అయోధ్యలో రాముడి టెంపుల్‌ నిర్మాణం భారతీయుల కల కాగా, దానిని నిజం చేసింది కేంద్ర ప్ర‌భుత్వం.ఈ ప్రాణ ప్ర‌తిష్ట వేడుకని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఎంతో మందికి అయోధ్య వెళ్లారు. ఇక టాలీవుడ్ నుండి చిరంజీవి, రామ్‌చరణ్ ల‌కి కూడా ఆహ్వానం ద‌క్క‌గా వారు కూడా అక్క‌డికి చేరుకున్న‌ట్టు తెలుస్తుంది..

ప్ర‌తిష్ట‌కి కొన్ని గంట‌ల ముందే అయోధ్య చేరుకున్న చిరంజీవి, రామ్ చ‌రణ్ సంద‌డి చేశారు. వారు అయోధ్య‌కి వెళ్లే ముందు చిరు ఇంటికి అభిమానులు భారీగా త‌ర‌లి రాగా, వారికి అభివాదం చేశారు చిరు, రామ్ చ‌ర‌ణ్‌. ముందుగా రామ్ చ‌ర‌ణ్ అభివాదం చేయ‌గా, ఆ త‌ర్వాత చిరంజీవి న‌మ‌స్కారం చేసి ఫ్యాన్స్‌ని ఉత్తేజ‌ప‌రిచారు. ఇక అక్క‌డి వారి అభిమానానికి ముగ్దులయ్యారు చిరు, రామ్ చ‌ర‌ణ్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే అయోధ్యలో రాముడి ప్రాణ ప్ర‌తిష్ట వేడుక‌కి ప్రభాస్‌,ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కి కూడా ఆహ్వానం అందిన‌ట్టు తెలుస్తుంది. సుమారు 2500 మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ సినిమాల విష‌యానికి వ‌స్తే .. మెగాస్టార్‌ చిరంజీవి ప్ర‌స్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించి రీసెంట్‌గా గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది మూవీపై అంచ‌నాలు పెంచింది. మైథలాజికల్‌ అంశాలతో తెరకెక్కుతుంది. మరోవైపు రామ్‌చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తుంది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీపై రామ్ చ‌రణ్ అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌డ‌మే కాకుండా అనేక రికార్డ్ లు క్రియేట్ చేస్తుంద‌ని భావిస్తున్నారు.

Exit mobile version