ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్న చిన్న గొడవలకే విడాకుల బాట పడుతుండడం మనం చూస్తున్నాం. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఏళ్లు గడిచిన తన బంధంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ వచ్చారు. తరగని ప్రేమానుబంధంతో ఎన్నో లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు చిరు-సురేఖ దంపతులు. అల్లు రామలింగయ్య చిరంజీవి గురించి ఎన్నో ఎంక్వైరీలు చేసి అతనిని నమ్మి తన కూతురిని ఆయన చేతిలో పెట్టాడు. అయితే అల్లు రామలింగయ్య ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా మంచిగా చూసుకుంటున్నాడు. ఓ సందర్భంలో చిరు.. సురేఖ గురించి చెబుతూ తాను మెగాస్టార్‌గా ఈ స్థాయిలో ఉండడానికి సురేఖనే ముఖ్య కారణమని చెప్పాడు. తాను ఇంటి విషయాలపై దృష్టి పెట్టకుండా సినిమాపై పూర్తిగా ఫోకస్ చేయడం వెనక సురేఖ ప్రధాన కారణం అని మెగాస్టార్ అన్నారు.
ఇన్నేళ్ల మా ఇద్దరి దాంపత్య జీవితం లో నేను ఒక్కసారి కూడా సురేఖ తో దురుసుగా ప్రవర్తించలేదు. సురేఖ ఎంతో గొప్ప మనిషి. ఈరోజు మా కుటుంబం ఇలా కలిసిమెలిసి ఉంటుందంటే దానికి కారణం సురేఖనే. ప్రతీ విషయాన్నీ ఎంతో చక్కగా అర్థం చేసుకుంటూ, ప్రతీ సమస్యని నా దాకా రాకుండా పరిష్కరిస్తుంది. అలాంటి భార్య నాకు దొరకడం, నేను చేసుకున్నఅదృష్టం అంటూ సురేఖ గురించి చిరు చాలా గొప్పగా మాట్లాడారు. ఇటీవల సురేఖ బర్త్ డే సందర్భంగా ఆమెకి చాలా ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ అంటూ తన భార్య సురేఖ పేరుని కలిసి వచ్చేలా కవిత చెబుతూ తన భార్యకి విషెస్ తెలియజేశాడు.చిరంజీవి చేసిన పోస్ట్‌పై పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇన్ స్టాలో లైకులు, కామెంట్లు వెల్లువలా వచ్చాయి.
అయితే చిరు, సురేఖల పెళ్లై ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా చాలా అన్యోన్యంగా ఉంటున్న చిరంజీవి, సురేఖల మధ్య ఎంత గ్యాప్ ఉందనేది చాలా మందికి తెలియదు. సురేఖ పెళ్లి సమయంలో ఆమె వయస్సు 22 కాగా, చిరంజీవిది 25. అంటే వారిద్దరి మధ్య గ్యాప్ కేవలం మూడేళ్లు మాత్రమే. సురేఖ ఫిబ్రవరి 18,1958లో జన్మించింది. చిరంజీవి 1955 ఆగస్ట్ 22న జన్మించారు. ఇక చిరు ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ‘బింభిసారా’ డైరెక్టర్ వసిష్ఠ తో ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం.