మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింత రెట్టింపు కానుంది. అయితే సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్‌కి అంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఆయనని కొందరు సీనియర్స్ ర్యాగింగ్ చేశారట. ఇప్పుడు అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. నిజానికి రామ్ చరణ్ ని ర్యాగింగ్ చేసేంత కెపాసిటీ ఇండస్ట్రీలో ఎవరికి లేకపోయినప్పటికీ కొంతమంది సీనియర్ నటులు ఆయనని ఫన్నీగా ర్యాగింగ్ చేసినట్టు సమాచారం.
అప్పట్లో సీనియర్ నటులుగా మంచి పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం లాంటి నటులు.. రామ్ చరణ్ కెరియర్ మొదట్లో మేము సీనియర్స్. చెప్పినట్టు వినాలంటూ ఫన్నీగా అతనని ర్యాగింగ్ చేశారట. అయితే అప్పుడు రామ్ చరణ్ కూడా వారితో సరదాగానే ఉన్నారట. ఎక్కడ కూడా అతను వారితో విభేదించలేదట. .సీనియర్ నటులు సలహాలు మనకు అవసరం.. వాళ్ల సీనియార్టీని మనం ఫాలో అవ్వాలి అనే ఉద్దేశ్యం లో స్వీకరించి వాళ్ళు ఏం చెప్పినా కూడా దాన్ని తుచా తప్పకుండా పాటిస్తూ వచ్చేవాడట రామ్ చరణ్. ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు అందువల్లే మా హీరో ఈరోజు గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
రామ్ చరణ్ అప్పట్లో అంత ఓపిక, పద్దతిగా ఉన్నాడు కాబట్టే ఇప్పుడు ఆయనకి ఇంత క్రేజ్ దక్కిందని అంటున్నారు. ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండే మనస్తత్వం రామ్ చరణ్‌ది. తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ అంటూ పలువురు ఆయనని ఆకాశానికి ఎత్తుతుంటారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కియారా ఇందులో కథానాయికగా కనిపించి అలరించనుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.