మ‌ర‌ణించి కూడా ఇద్ద‌రి జీవితాల‌లో వెలుగు నింపిన ప్ర‌ముఖ విలన్

  • Publish Date - March 30, 2024 / 07:21 AM IST

ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో వ‌రుస విషాదాలు నెల‌కొంటున్నాయి. అనారోగ్య కార‌ణాల వ‌లన మంచి మంచి ఆర్టిస్ట్స్ క‌న్నుమూస్తుండ‌డం అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. ఇక మార్చి 29న అర్దరాత్రి కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ(48) కన్నుమూశారు. శుక్రవారం అర్దరాత్రి ఛాతినొప్పితో అస్వస్థతకు గురికాగా.. వెంటనే కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ స‌మ‌యానికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు. త‌క్కువ వ‌య‌స్సులోనే టాలెంట్ ఉన్న న‌టుడు ఇలా చ‌నిపోవడాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. డేనియల్ బాలాజీ హఠాన్మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో ఉంది. ఆయ‌న మృతిపై ప‌ల‌వురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నారు.

డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం యాభైకి పైగా సినిమాలు చేశాడు. ఎక్కువగా విలన్ రోల్స్ చేసి ఫేమ‌స్ అయ్యాడు. తెలుగులో సాంబ, చిరుత, ఘర్షణ, టక్ జగదీశ్.. లాంటి పలు సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు చేసి అద‌ర‌గొట్టాడు. ఇక త‌మిళంలో మాయావన్, బిగిల్, వడాచెన్నై.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ట‌క్ జ‌గ‌దీష్ తెలుగులో చివ‌రి సినిమా. డానియ‌ల్ త‌మిళ స్టార్ హీరో విజ‌య్‌కి మంచి స్నేహితుడు కూడా.2001లో చితి సీరియల్‏తో ఆయ‌న బుల్లితెర‌కి ప‌రిచ‌యం కాగా, అందులో డేనియ‌ల్ అనే పాత్ర‌లో క‌నిపించి మెప్పించాడు. ఇక 2002లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మధతిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.

డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాకా, ఫ్రాధు ఫ్రాదు చిత్రాల్లో న‌టించి అల‌రించిన డేనియ‌ల్ ఆ త‌ర్వ‌త ప‌లు సినిమాల‌లో నెగెటివ్ రోల్స్ చేసి ఆక‌ట్టుకున్నాడు. ఈయ‌న ప్రముఖ దర్శకుడు, నిర్మాత సిద్దలింగయ్య సోదరి కుమారుడు. చెన్నైలోని తారామణి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్సు పూర్తి చేసిన ఆ త‌ర్వాత టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. అత‌ని న‌ట‌న మెచ్చి సినిమాల‌లో తీసుకున్నారు. వైవిధ్య‌మైన న‌ట‌న‌తో మెప్పించే బాలాజీ ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈరోజు పురసైవల్కంలోని ఆయన నివాసంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్టు  తెలుస్తుంది. దైవాన్ని బాగా న‌మ్మే బాలాజి తమిళనాడులోని ఆవడిలో ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అది పూర్తి అవ్వకుండానే ఆయ‌న ఇలా మ‌ర‌ణించ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర విషాదంలో ఉన్నారు. కాగా డేనియల్ బాలాజీ అవ‌య‌వ‌దానం చేసి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు.ఆయ‌న రెండు కళ్ళు ఆపరేషన్ చేసి భద్ర పరిచారు. అంధులకు ఆ కళ్ళు అమ‌ర‌చ్చ‌నున్నారు. అయితే తాను మ‌రణించ‌డానికి ముందు బాలాజీ తన కళ్ళను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ఐ రిజిస్టర్ లో తన పేరు నమోదు చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల అనుమతి పత్రం కూడా పొందాడు.చ‌నిపోతూ ఇద్ద‌రి అంధుల‌కి వెలుగు నింపిన బాలాజీని ప్ర‌తి ఒక్క‌రు కొనియాడుతున్నారు.

Latest News