బాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో దీపికా-రణ్‌వీర్ జంట ఒకటి. వీరిద్దరు చూడముచ్చటైన జంటలలో ఒకరిగా ఉన్నారు. ఈ ఇద్దరు విడిపోతున్నట్టుగా ఎన్నో ప్రచారాలు జరుగుతుండగా, పలు సందర్భాలలో వాటిని కొట్టి పారేసారు. ఇటలీలో పెళ్లి చేసుకున్న ఈ జంట దాదాపు ఐదేళ్ల తర్వాత తమ పెళ్లి వీడియోను విడుదల చేశారు. ఈ జంట తాజాగా హిట్ చాట్ షో కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ తొలి ఎపిసోడ్ కి హాజరు కాగా, ఆ షోలో తమ పెళ్లితో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాలు తెలియజేశారు. ఇక పెళ్లి వీడియోతో పర్ఫెక్ట్ వెడ్డింగ్ నుండి మునుపెన్నడూ చూడని ఫుటేజ్‌ను అందించారు. అయితే ఈ ఫుటేజ్‌లో రణ్‌వీర్.. మాల్దీవుల్లో దీపికకి ఎలా ప్రపోజ్ చేశాడు, ఆమె తల్లిదండ్రులను కలవడానికి, వారి ఎంగేజ్‌మెంట్ వార్తలను వారికి తెలియజేయడానికి వారు బెంగళూరుకు ఎలా వెళ్లారో అన్ని కూడా వీడియోలో ఉన్నాయి.
పెళ్లికి సంబంధించిన ఫుటేజ్ రణవీర్ వారి ఎంగేజ్‌మెంట్ పార్టీలో దీపిక గురించి చెప్పుకోవడంతో ప్రారంభం అయింది. దీపికా తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణె కూడా రణవీర్ తమ నలుగురితో కూడిన ‘బోరింగ్’ కుటుంబానికి కొంత ఉత్సాహాన్ని, క్రేజీనెస్ తెస్తాడని చెప్పుకురావడం విశేషం. ఇక లేక్ దగ్గర ఏర్పాటు చేసిన మెహందీ ఫంక్షన్‌లో రణ్‌వీర్ డ్యాన్స్ చేయడం, పెళ్లికి సిద్ధమవుతున్న దీపిక ఆభరణాలతో అలంకరించుకోవడం, మండపం వద్ద ప్రతిజ్ఞలు చేసుకోవడం అన్ని కూడా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి మూమెంట్ కూడా మనసుకి హత్తుకునేలా ఉండడంతో కరణ్ జోహర్ ఎమోషనల్ అయ్యారు.
ఇన్ని రోజుల తర్వాత మీ పెళ్లి వీడియో చూడటం, ఒకరికొకరు ప్రేమను పంచుకోవడాన్ని చూడటం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, జీవితంలో తాను ఏదో కోల్పోతున్నట్టుగా ఉందని కరణ్ జోహార్ స్పష్టం చేయడం గమనర్హం. ఇక ఆ సమయంలో దీపిక.. సరైన సమయంలో ఎవరైనా దొరుకుతారని కరణ్ జోహార్‌కి కాస్త ధైర్యం అందించింది.ఇక పశ్చాత్తాపం చెందడం కంటే సరైన వ్యక్తిని కనుగొనడం ఎంత ముఖ్యమో కూడా దీపిక కూడా చెప్పడం విశేషం. గురువారం అర్ధరాత్రి డిస్నీ+ హాట్‌స్టార్‌లో కాఫీ విత్ కరణ్ ప్రసారం అవుతుంది.ఈ ఎపిసోడ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీపికాకి రణ్‌వీర్ 2012లో ప్రపోజ్ చేసాడట. ఇండైరెక్ట్ గా అతనికి ఓకే చెప్పి కొన్ని రోజులు డేటింగ్ చేస్తూ ట్రావెల్ చేద్దాం అని చెప్పిందట. మూడేళ్లు దీపికా రణవీర్ డేటింగ్ చేసిన తర్వాత రణవీర్ నిశ్చితార్థం చేసుకుందామని అడగడంతో ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా 2015లో నిశ్చితార్థం చేసుకొని..నిశ్చితార్థం జరిగిన మూడేళ్ళ తర్వాత 2018లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. దీంతో 6 ఏళ్ళ ప్రేమ తర్వాత దీపికా రణవీర్ వివాహం జరిగింది.