Site icon vidhaatha

పెళ్లైన ఇన్నేళ్ల‌కి త‌ల్లి కాబోతున్న దీపికా.. త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ చెప్ప‌నుందా..!

ఇటీవ‌లి కాలంలో స్టార్ హీరోయిన్స్ సైతం పెళ్లిళ్లు చేసుకొని పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చి సంసార జీవితంలో సంతోషంగా జీవిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క రెండోసారి పండంటి బిడ్డకు జ‌న్మనిచ్చింది. అంత‌క‌ముందు ప్రియాంక చోప్రా, క‌రీనా క‌పూర్ వంటి బీటౌన్ భామ‌లు కూడా త‌ల్లులుగా మార‌డం మ‌నం చూశాం. అయితే 2018 లో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన దీపికా ప‌దుకొణే ఇప్ప‌టి వ‌ర‌కు గుడ్ న్యూస్ చెప్ప‌లేదు. ఎప్పుడెప్పుడు ఆమె గుడ్ న్యూస్ చెబుతుందా అని ఆమె ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో దీపికా త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుందంటూ నెట్టింట ఓ వార్త తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

దీపికాకి పెళ్లైన, వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. స్టార్ హీరోల సరసన అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన కల్కీ సినిమాలో అవ‌కాశం అందుకున్న ఈ భామ బాలీవుడ్‌లో కూడా కొన్ని చిత్రాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. ప్రస్తుతం హిందీలో సింగం రిటర్న్స్ చేస్తున్న దీపికా ఇందులో రెచ్చిపోయి న‌టిస్తుంది. ముద్దుసీన్లు, బెడ్ సీన్లలో న‌టించేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. దీంతో అంద‌రు అవాక్క‌వుతున్నారు. అయితే దీపికా ప‌దుకొణే త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతున్నార‌నే విష‌యం ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఫిబ్రవరి 18న లండన్‌లో జరిగిన బాఫ్టా (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల కార్యక్రమంలో వ్యాఖ్యాతలలో ఒకరిగా దీపికా పాల్గొంది.

ఆ స‌మ‌యంలో దీపికా ప‌దుకొణే బంగారు, వెండి రంగుల కలయికలో ఉన్న చీరను ధరించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇక ఆమె చీర కొంగుతో తన బేబీ బంప్‌ను దాచుకోవడానికి ప్రయత్నించారంటూ అభిమానులు కొంత ఊహాలోచ‌న‌లు చేస్తున్నారు. స‌రిగ్గా దీపికాని గ‌మ‌నిస్తే ఆమెకి బేబీ బంప్ ఉందేమోననే సందేహం చాలా మందికి కలిగింద‌ని, వేడుక నుంచి తిరిగొచ్చేసిన దీపిక వదులుగా ఉండే ఔట్‌ఫిట్‌లో దర్శనమిచ్చిందని, ఇంత‌కు మించిన సాక్ష్యాలు ఏమి కావాలంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం దీపికా పిక్స్ మాత్రం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Exit mobile version