చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. చిరుత సినిమాతో వెండితెరకి పరిచయమైన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆయనకి ఇప్పుడు సౌత్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీతో తన క్రేజ్‌మరింత పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే రామ్ చరణ్ ఫాలోయింగ్ రోజురోజుకి మరింత పెరుగుతూ పోతుంది. ఇందులో సామాన్యులే కాక సెలబ్రిటీలు ఉంటున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు మోడల్ జ్ఞానేశ్వరి కండ్రేగుల తనకి రామ్ చరణ్ అంటే తెగ పిచ్చి అంటుంది.
జ్ఞానేశ్వరి మోడల్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి ఆ తర్వాత నటిగా మారింది. పెళ్లి చూపులు అనే ఓ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కొన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించి అలరిస్తుంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన మంత్ అఫ్ మధు అనే సినిమాలో మంచి పాత్ర చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు నాగచైతన్య నటించిన దూత సిరీస్ లో ఓ క్యారెక్టర్ చేసి అదరహో అనిపించింది. దూతకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో జ్ఞానేశ్వరి పాల్గొనగా ఆ వీడియోలు కొన్ని నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ భామ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే తనకు ఎంత ఇష్టమో వెల్లడించింది బ్యూటీ.
గతంలోనే జ్ఞానేశ్వరి.. తాను చరణ్ కి పెద్ద ఫ్యాన్ అని, చిన్నప్పట్నుంచి చరణ్ ఫోటోలు కట్ చేసి పుస్తకంలో అతికించేదాన్ని అని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ.. ఆ పుస్తకం ఇంకా ఉంది. పుస్తకం నిండా చరణ్ ఫోటోలు ఉన్నాయి. ఈ సారి ఇంటర్వ్యూలో ఆ ఫోటోలు ఉన్న పుస్తకం తెచ్చి మొత్తం చూపిస్తాను అని పేర్కొంది. మీకు చరణ్ ఎదురయ్యి.. ఆయన్ని కలిస్తే ఏమడుగుతారు అని యాంకర్ ప్రశ్నించగా. ఒక పదేళ్ల క్రితం చరణ్ ని కలిస్తే పెళ్లి చేసుకుంటారా అని అడిగేదాన్ని కాని ఇప్పుడు మాత్రం మీతో కలిసి వర్క్ చేయాలని ఉంది అని మాత్రమే అడుగుతాను అని తెలిపింది. దీంతో జ్ఞానేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.