ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇటీవల మహేష్ బాబు వరుస సక్సెస్‌లని అందుకుంటూ దూసుకుపోతున్నాడు. మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం కాగా, ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ మూవీ మహేష్‌కి మరో బ్లాక్ బస్టర్ అందించడం ఖాయమని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబుకి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మొదటి నుంచి కూడా మహేష్ బాబు డైరెక్టర్ చెప్పినట్టుగానే సినిమాలు చేస్తూ వెళ్లాడు.అయితే మహేష్ బాబుతో సినిమా చేసి అడ్రెస్ లేకుండా పోయిన ఓ డైరెక్టర్ ఉన్నారు.ఆయన మరెవరో కాదు శ్రీకాంత్ అడ్డాల. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాని మహేష్ బాబు హీరోగా తెరకెక్కించాడు శ్రీకాంత్. ఇందులో ఎమోషన్స్, సెంటిమెంట్స్ ని బాగా డీల్ చేసి మహేష్ బాబుకి మంచి విజయం అందించాడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో యాక్షన్ మూవీ ప్లాన్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఆ స్క్రిప్ట్ చూసిన మహేష్ అలాంటి జానర్ వద్దు.. ఫ్యామిలీ చిత్రమే చేద్దామని అన్నాడు.
దీంతో బ్రహ్మోత్సవం అనే స్క్రిప్ట్ మహేష్‌కి వినిపించాడు. ఇది మహేష్‌కి బాగా నచ్చడంతో ఫ్యామిలీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. యాక్షన్ సినిమా కాకుండా ఫ్యామిలీ సినిమా చేయడం తో ఆ సినిమా ప్లాప్ అయింది ఇక దాంతో శ్రీకాంత్ కెరీయర్ అనేది డైలమా లో పడింది. ఆయనకి అడపాదడపా అవకాశాలు వస్తున్నా కూడా అంత పెద్ద హిట్ కావడం లేదు. వెంకటేష్ తో నారప్ప సినిమా చేశాడు. ఈ సినిమా కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత చేసిన పెద్ద కాపు సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.మరి రానున్న రోజులలో శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి సినిమాలు చేస్తాడు, మంచి హిట్స్ అందుకుంటాడా లేదా అనేది చూడాల్సి ఉంది.