Site icon vidhaatha

రైతు బిడ్డ గురించి గొప్ప‌గా చెప్పిన బిగ్ బాస్.. వీరోచితంగా మాట్లాడి మ‌న‌సులు గెలుచుకున్న యావ‌ర్

బిగ్ బాస్ సీజన్ 7లో ఇది చివరి వారం కావ‌డంతో ఇప్పుడు హౌజ్‌లో ఉన్న ఆరుగురి కంటెస్టెంట్స్ ఏవీలు చూపిస్తూ వారిని థ్రిల్ చేస్తున్నాడు. గార్డెన్ ఏరియాని చాలా ప్ర‌త్యేకంగా డెక‌రేట్ చేసి అక్క‌డికి కంటెస్టెంట్స్‌ని పిలిచి వారు కొత్త అనుభూతికి లోన‌య్యేలా చేస్తున్నారు. ఇప్పటికే అర్జున్‌, అమర్‌, ప్రియాంక, శివాజీ లకు బిగ్‌ బాస్‌ ఘనంగా స్వాగతం పలికి థ్రిల్ చేయ‌గా, బుధవారం ఎపిసోడ్‌లో యావర్‌, పల్లవి ప్రశాంత్‌లకు గ్రాండ్‌గా స్వాగతం పలికారు. ముందుగా యావర్‌ జర్నీని చాలా గొప్పగా వర్ణించాడు బిగ్‌బాస్‌. తన పోరాట పఠిమని, యోధుడిలా ఆడిన తీరుని, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న తీరుని ప్ర‌శంసిస్తూ యావ‌ర్ ఏవీని చూపించారు బిగ్ బాస్.

యావ‌ర్‌కి సంబంధించి చాలా డీటెయిలింగ్‌గా ఏవీ చూపించ‌డంతో యావ‌ర్ కన్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. ఏవీని చూసిన ఆనందంలో ఉబ్బిత‌బ్బిబ‌యిన యావ‌ర్ హిందీలో మాట్లాడుతూ.. తాను చ‌రిత్ర సృష్టిస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. దమ్ము, సామర్థ్యం తనలో ఉందని ,. తాను ఎక్కడి నుంచి వచ్చాను కాదు, బిగ్‌ బాస్‌ ఎలా మార్చాడు అని తలుచుకుని చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు యావ‌ర్. బిగ్ బాస్ విన్న‌ర్ గా మారితే తాను అవ‌స‌రం ఉన్న వారికి అండ‌గా నిల‌బ‌డతాన‌ని కామెంట్ చేశాడు. నేను కొల‌క‌త్తాకి చెందిన‌వాడిని కాదు, మీ అందరివాడిని అంటూ చాలా వీరోచితమైన వ్యాఖ్య‌లు చేసి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు యావ‌ర్. ఇక ఆ త‌ర్వాత రైతుబిడ్డ యావ‌ర్‌కి పిలుపు వ‌చ్చింది.

రైతు బిడ్డగా, కామన్‌ మ్యాన్‌గా వచ్చావని, బిగ్‌ బాస్‌ షోకి రావాలని ఎన్నో రోజులుగా కలలు కన్నావని, ఇప్పుడు ఆ కలలు నిజం అయ్యాయని చెప్పారు బిగ్ బాస్..ఇక హౌజ్‌లో ప్ర‌శాంత్ ఆట‌తీరుని ప్ర‌శంసించాడు బిగ్ బాస్. ఆయ‌న మాట‌ల‌కి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు ప్ర‌శాంత్. మడమ తప్పని తీరు, పుష్పలా పోరాడిన తీరుని చూపించిన విధానం అదిరిపోయింద‌ని అన్నాడు. అయితే తాను రైతు బిడ్డని అని, రైతు గర్వపడేలా చేస్తానని ప్ర‌శాంత్ మాట ఇచ్చాడు. మొత్తానికి హౌజ్‌లో ఉన్న ఆరుగురి ఏవీలు పూర్తి కావ‌డంతో నేడు హౌజ్‌లో ఎలాంటి సంద‌డి ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. ఈ సీజ‌న్ విజేత‌గా ప్రశాంత్‌ విన్నర్‌ అని అంటున్నారు. శివాజీ కూడా పోటీలో ఉండ‌గా , యావర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. 

Exit mobile version