Site icon vidhaatha

కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌కి ఫారెన్‌లో కూడా ఫుల్ క్రేజ్…ఈ పాట‌కి జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తూ…!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ గుంటూరుకారం. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఫ్యామిలీ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌గా, ఈ చిత్రాన్ని ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మూవీ మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంటుంది. అయితే ఈ మూవీ సంగ‌తేమో కాని ఇందులో కుర్చీ మ‌డ‌త‌పెట్టి సాంగ్‌కి మాత్రం ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌స్తుంది. మ‌హేష్ బాబు ఊర మాస్ సాంగ్‌కి స్టెప్పులు వేయ‌డం, ఆయ‌న‌తో పాటు శ్రీలీల కూడా ఈ పాట‌లో దుమ్ము రేప‌డంతో ఈ సాంగ్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌ని ఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా అంద‌రు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ ఇద్ద‌రు కూడా ఈ పాట‌కి డ్యాన్స్ చేసిన‌ట్టు ఓ వీడియోని క్రియేట్ చేశారు. ఎడిటెడ్ వీడియో తెగ వైర‌ల్ అయింది. ఇక ఇప్పుడు తాజాగా జిమ్‌లో ఫార్న‌ర్స్ వాడ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ఫారినర్స్ కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌తో జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుండ‌గా, ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ వీడియోని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడం విశేషం.

చూస్తుంటే రానున్న రోజుల‌లో ఈ పాట‌కి క్రికెట‌ర్స్ సైతం కాలు క‌దిపేలా క‌నిపిస్తున్నారు. పాట ఓ రేంజ్‌కి వెళ్ల‌డం ఖాయం అని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు. ఇక గుంటూరు కారం చిత్రం సంక్రాంతి బ‌రిలో మంచి అంచ‌నాల‌తో విడుద‌లైంది. అయితే మూవీ ఆ రేంజ్ అందుకోలేక‌పోయింది. మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబో సినిమా సంక్రాంతికి పెద్ద హిట్ కొడుతుంది ముందు నుండే ప్ర‌చారాలు భారీగా సాగాయి. కాని మ‌హేష్ అభిమానుల‌ని ఈ సినిమా కాస్త డిజప్పాయింట్ చేసింది అని చెప్పాలి. త్వ‌ర‌లో మ‌హేష్-రాజ‌మౌళితో క‌లిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయ‌నుండ‌గా, ఈ మూవీకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. స‌మ్మ‌ర్ నుండి మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం.

Exit mobile version