ప్రతివారం ప్రేక్షకులకి పసందైన వినోదం దొరుకుతుంది. ఒకవైపు థియేటర్స్, మరోవైపు ఓటీటీలో కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ దక్కుతుంది. థియేటర్స్ విషయానికి వస్తే..ఈ వారం థియేటర్లలో ‘సలార్’, ‘డంకీ’, ‘ఆక్వామెన్’ వంటి భారీ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీ గా ఉన్నాయి. మరోవైపు నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ+హాట్ స్టార్, జియో సినిమా, ఆహా, జీ5 లలో మీరు వీక్షించడానికి మీ అభిరుచులకి తగ్గట్టుగానే సరికొత్త మూవీస్, వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతున్నాయి. కామెడీలు, యాక్షన్‌లు, డ్రామాలు, థ్రిల్లర్‌లు, మరింకెన్నో జానర్స్ చిత్రాలు పలకరించబోతున్నాయి. ఈ వారం ‘ఆదికేశవ’, ‘సప్త సాగరాలు దాటి- సైడ్ బి’, ‘రాక్షస కావ్యం’, ‘వ్యూహం’ వంటి చిత్రాలు ప్రేక్షకులని తప్పక అలరించే విధంగా ఉంటాయి.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ వారం జాబితే చూస్తే… సిండీ లా రెజీనా: ద హై స్కూల్ ఇయర్స్ – డిసెంబరు 20 నుండి, మ్యాస్ట్రో – డిసెంబరు 20 నుండి, ద టేమింగ్ ఆఫ్ ష్రూడ్ 2 – డిసెంబరు 20 నుండి, స్ట్రీమింగ్ అవుతుంది. ఇక అల్హమర్ H.A – డిసెంబరు 21, లైక్ ఫ్లవర్స్ ఇన్ సాండ్ – డిసెంబరు 21, రెబల్ మూన్ పార్ట్ 1: ఏ చైల్డ్ ఆఫ్ ఫైర్ – డిసెంబరు 21, ఆదికేశవ – డిసెంబరు 22 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక కర్రీ & సైనైడ్: ద జాలీ జోసెఫ్ కేస్ – డిసెంబరు 22 నుండి, యోంగ్‌సాంగ్ క్రియేచర్ – డిసెంబరు 22, కుయికో – డిసెంబరు 22, .ఏ వ్యాంపైర్ ఇన్ ద ఫ్యామిలీ – డిసెంబరు 24, పింక్ ఫాంగ్ సింగ్-అలాంగ్ మూవీ 3: క్యాచ్ ద జింజర్ బ్రెడ్ మ్యాన్ – డిసెంబరు 24 వంటి చిత్రాలు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నాయి.
ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ద ఏసెస్ – డిసెంబరు 21 నుండి స్ట్రీమింగ్ కానుండగా, డ్రై డే – డిసెంబరు 22, సాల్ట్ బర్న్ – డిసెంబరు 22, సప్త సాగరాలు దాటి సైడ్-బి – డిసెంబరు 22 స్ట్రీమ్ కానున్నయి. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూస్తే.. BTS మాన్యుమెంట్స్: బియాండ్ ద స్టార్ – డిసెంబరు 20, డ్రాగన్స్ ఆఫ్ వాండర్ హ్యాచ్ – డిసెంబరు 20, పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ – డిసెంబరు 20, వాట్ ఇఫ్..?: సీజన్ 2 – డిసెంబరు 22 నుండి స్ట్రీమ్ కానున్నాయి. ఇక జీ5లో అడి – డిసెంబరు 22, హోమోరస్లీ యూవర్స్: సీజన్ 3 – డిసెంబరు 22, స్ట్రీమింగ్ కానుండగా, జియో సినిమాలో బార్బీ – డిసెంబరు 21, హే కమీని – డిసెంబరు 22 నుండి స్ట్రీమ్ కానున్నాయి. ఇక లయన్స్ గేట్ ప్లే లో ఫియర్ ద నైట్ – డిసెంబరు 22 నుండి స్ట్రీమ్ కానుంది.