Site icon vidhaatha

హౌజ్‌లో ఒకే ఒక్క లేడి కంటెస్టెంట్.. ఆమె ముందు డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ర‌చ్చ‌

బిగ్ బాస్ సీజ‌న్ 7 రేప‌టితో ముగియ‌నుంది. ప్ర‌స్తుతం హౌజ్‌లో ఆరుగురు మాత్ర‌మే ఉండ‌గా, వారిలో ఒక‌రికి మిడ్ వీక్ ఎలిమినేష‌న్ ఉంటుందని అందరు అనుకున్నారు. కాని అది పుకారుగానే మిగిలిపోనున్న‌ట్టు తెలుస్తుంది. టాప్ 6 కంటెస్టెంట్స్ ఫినాలే రోజు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కి రానున్న‌ట్టు తెలుస్తుంది. ఇక గేమ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో వారు కొంత రిలాక్స్‌డ్ క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ బ‌య‌ట‌కి మాత్రం చాలా స‌ర‌దాగా ఉంటున్నారు. నామినేషన్స్, ఎలిమినేషన్స్, కెప్టెన్సీ టాస్క్స్ వంటివి లేక‌పోగా, సొంత ఇంటి నుండి హౌస్ మేట్స్ కి ఫుడ్ వస్తుండ‌డంతో వాటిని ఆస్వాదిస్తూ ఫుల్ చిల్ అవుతున్నారు. తాజా ఎపిసోడ్‌లో అమర్ దీప్ ని జ్యోతిష్కుడుగా మార్చాడు బిగ్ బాస్.

జ్యోతిష్కుడు గెటప్ లో అమర్ .. పల్లవి ప్రశాంత్ కి జాతకం చెబుతూ అమర్ డబుల్ మీనింగ్స్ మాట్లాడాడు. ముందుగా జాతకం చెప్పించుకునేందుకు ప్రశాంత్ వెళ్ళాడు. బూతద్దం నుండి చేతి రేఖలు చూస్తూ… అబ్బో చాలా పెద్దది, అన్నాడు. పెద్ద‌దా అని ప్ర‌శాంత్ అన‌గా, అమ‌ర్ సాగ‌దీస్తూ ప్రియాంక ముందే చాలా పెద్ద‌ది అటూ సాగ‌దీసాడు. ద్వందార్ధాల‌తో ఆయ‌న మాట్లాడిన మాట‌లకి ప్రియాంక‌కి ఏం చేయాలో తెలియ‌క న‌వ్వుతూ ఉండిపోయింది. ప్రియాంక జాతకం కూడా చెబుతూ చాలా ఫైర్ బ్రాండ్ అంటూ , లోపల ఒకరు, బయట ఒకరు అని చెప్పారు. ఇక శివాజీ జాతకం చెబుతూ… తనకు ఇష్టమైన వారిలో యావర్, అమర్ దీప్ ఉన్నారన్నారు. కానీ యావర్ కే ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారని, తనకేం లేదని జ్యోతిష్యం చెప్పారు.

అర్జున్ జాతకం చెప్పేందుకు ప్రయత్నించ‌గా, అర్జున్ అమర్ కే షాక్ ఇచ్చాడు. తన జాతకం చెప్పించుకోవడం కాకుండా అమర్ దీప్ జాతకాన్ని చెబుతూ వచ్చాడు. అనగనగా ఓ కారు.. నాకు ఆ కారే గుర్తుకొస్తుందంటూ…. ఓ స్టోరీ చెప్పుకురావ‌డంతో వ‌ద్దు బాబోయ్ అంటూ వేడుకున్నారు. ఇది ఫన్నీగా అనిపించింది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మరో ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు. ఇంటి ఫుడ్ ను గెలుచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించ‌గా, ఈ సారి గెలుపొందిన వారు తమ ఫుడ్ ను మరోకరి అందించాల్సి ఉంటుంది. దీంతో తన ఫుడ్ ను పల్లవి ప్రశాంత్ కు ఇచ్చారు అర్జున్. ఇక రేప‌టి ఫినాలే ఎపిసోడ్‌కి మ‌హేష్ బాబు గెస్ట్‌గా రాబోతున్నార‌ని జోరుగా ప్రచారం న‌డుస్తుంది.

Exit mobile version