Site icon vidhaatha

ఎట్ట‌కేల‌కి బోణీ కొట్టిన గుజ‌రాత్ జెయింట్స్.. ఆడిన ఐదు మ్యాచ్‌ల‌లోఇది తొలి విజయం

ఐపీఎల్ రేంజ్‌లోనే డ‌బ్ల్యూపీఎల్ కూడా ఎంతో ఆసక్తిక‌రంగా సాగుతుంది. మ‌హిళా క్రికెట‌ర్స్ అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో క్రికెట్ ప్రేమికుల‌ని ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. అయితే తాజాగా గుజ‌రాంత్ జెయిట్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌ర‌గ‌గా, ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ బోణి కొట్టింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌)లో గుజరాత్‌ జెయింట్స్‌కి ఇది తొలి విజ‌యం. ముందు బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ బేత్‌ మూనీ(51 బంతుల్లో 85 నాటౌట్‌, 12ఫోర్లు, సిక్స్‌), లౌరా వాల్వర్డ్‌ (45 బంతుల్లో 76, 13ఫోర్లు) ధనాధన్ బ్యాటింగ్‌తో అర్ధసెంచరీలు చేసి త‌మ జ‌ట్టుకి భారీ స్కోరు అందించారు.

ఆర్సీబీ బౌల‌ర్స్‌లో మిలోనెక్స్‌, వేర్‌హామ్‌ ఒక్కో వికెట్‌ తీశాయ‌గా, మిగ‌తా మూడు వికెట్స్ ర‌నౌట్ రూపంలో కోల్పోవ‌డం జ‌రిగింది. ఇక లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 180 ప‌రుగుల‌ స్కోరు చేసింది. వేర్‌హామ్‌ (48) రీచా ఘోష్‌ (30) ఫర్వాలేదనిపించారు. స్మృతి మంథాన ఈ మ్యాచ్ లో కేవ‌లం 24 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఇక మిగ‌తా బ్యాట్స్ఉమెన్స్ కూడా పెద్ద‌గా ప‌రుగులు రాబ‌ట్ట‌లేక‌పోయారు. దీంతో ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్‌పై ఓడిపోవ‌ల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక బౌల‌ర్స్‌లో గార్డ్‌నర్ 23 ప‌రుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. అయితే త‌మ జ‌ట్టుని గెలిపించిన బేత్‌మూనీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డ్ దక్కింది.

గత మ్యాచ్‌లో ఆర్సీబీ.. యూపీపై బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించి మంచి విజ‌యాన్ని చ‌వి చూసింది. రెండో సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా స్మృతి మంధాన (5 మ్యాచ్‌లలో 219) ఉండగా.. ఎల్లీస్‌ పెర్రీ, రిచా ఘోష్‌ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. బౌలర్లలో స్పిన్నర్‌ మోలినెక్స్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సోఫి డెవిన్‌లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆర్సీబీ టైటిల్ ఫేవ‌రేట్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. అయితే గుజరాత్‌ పరిస్థితి మాత్రం ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఆ జట్టు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ వైఫల్యాల ప్రదర్శన కొనసాగిస్తున్న నేప‌థ్యంలో టేబుల్‌లో చివ‌రి స్థానంలో నిలిచింది. త‌ర్వాతి మ్యాచ్‌ల‌లో అయిన మంచి విజ‌యాలు సాధిస్తుందా అనేది చూడాలి.

Exit mobile version