- బెనిఫిట్ షోలకూ వర్తింపు
- తెలంగాణ ప్రభుత్వం అనుమతి
విధాత: మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతికి సందడి చేయబోతున్నది. ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా.. మేకర్స్ అదే రేంజ్ లో వారికి ట్ర్రీట్ ఇస్తున్నారు. ఉన్నఫలంగా ‘గుంటూరు కారం’ సినిమా టికెట్ ధరలు పెంచేశారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు బెనిఫిట్ షోలకు కూడా వర్తింపజేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 23 చోట్ల ఈనెల 12న అర్ధరాత్రి ఒంటి గంటకి షోలు వేయబోతున్నారు.
సంక్రాంతి సందర్భంగా ఆరో షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఈనెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోను ప్రదర్శించనున్నారు. సింగిల్ స్ర్కీన్ లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 వరకూ టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫ్యాన్స్ బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. మహేష్ బాబుతల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందించారు.