Site icon vidhaatha

హిమ‌జ ఇంట్లో రేవ్ పార్టీ.. అడ్డంగా బుక్ అయిన బిగ్ బాస్ స్టార్స్

రాను రాను హైద‌రాబాద్ క‌ల్చ‌ర్ మ‌రింత దారుణంగా మారుతుంది. వింత క‌ల్చ‌ర్‌తో ప్ర‌తి ఒక్క‌రు భ‌యాందోళ‌న‌ల‌కి గుర‌వుతున్నారు. నైట్ పార్టీస్, రావే పార్టీస్ మితిమీరి జరుగుతుండ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. పోలీసులు ఎన్ని క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన కూడా ఇలాంటివి ఎక్క‌డోచోట జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతున్న రేవ్ పార్టీ ని పోలీసులు భ‌గ్నం చేయగా, వారి చేతికి పలువురు సినీ సెలబ్రెటీలు దొరికారాని సమాచారం. హైదరాబాద్ నగరం ఇబ్రహీంపట్నం లోని ఓ ఫాం హౌస్ పై పోలీసుల దాడులు చేయగా.. అక్కడ జరుగుతున్న రేవ్ పార్టీలో బిగ్ బాస్ ఫేమ్ హిమజతో పాటు 11మంది పాల్గొన‌గా వారంద‌రిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో బాగంగా ఎక్సైజ్ చట్టం,ఐపీసీ కింద హిమ‌జ‌తో పాటు ప‌లువురిపై కేసు నమోదునట్టుగా వార్తలు వ‌చ్చిన నేప‌థ్యంలో హిమ‌జ స్పందించింది. తన మీద తప్పుడు వార్తలు రావడంపై హిమజ మండిపడ్డారు. కొత్త ఇంట్లో దీపావళి సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నాను.. ఫ్రెండ్స్‌ని పిలిచాను.. పూజ చేసుకుంటున్నాను.. పోలీసులు వచ్చారు.. చెక్ చేశారు.. ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేశారు.. ఇళ్లంతా వెతికారు.. వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు.. వెళ్లిపోయారు..కానీ మీడియాలో మాత్రం ఎందుకు త‌ప్పుగా రాసారు. ఇంట్లో రేవ్ పార్టీనా? ఇంట్లో దీపావళి పూజ చేసుకుంటున్నాను ఆ విష‌యం మీకు చెప్పేందుకు లైవ్‌లోకి వచ్చాన‌ని పేర్కొంది హిమ‌జ‌.

నాపై విప‌రీత‌మైన ప్రచారాలు జ‌రిగిన నేప‌థ్యంలో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.. నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి.. నా గురించి అంద‌రు ఆరాలు తీస్తున్న నేప‌థ్యంలో నేను స్పందించాను. త‌ప్పుడు వార్తలు ఎవ‌రు ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు అర్ధం కావ‌డం లేదు. అస‌లు ఇలాంటివి ఎందుకు క్రియేట్ చేస్తారో చెప్పాల్సిన పని లేదు.. అలాంటి వాళ్ల గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అన్నట్టుగా హిమ‌జ తాజా వీడియోలో తెలియ‌జేసింది. హిమ‌జ అయితే త‌నపై వ‌చ్చే వార్త‌ల‌న్నింటికి క్లారిటీ ఇచ్చింది కాని , దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో అని ప్ర‌తి ఒక్కరు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version