బుల్లితెర బిగ్ రియాలిటీషో బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం ఫినాలే ఎపిసోడ్ జరుపుకోనుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఆరుగురు ఫైనలిస్ట్‌లు ఉండగా, వారికి తమ జర్నీలు చూపించి చాలా ఆనందపడేలా చేశారు. ప్రతి ఒక్కరు కూడా బిగ్ బాస్ జర్నీ అనేది లైఫ్‌లో మెమోరబుల్ జర్నీ అని చెప్పుకొచ్చారు. అయితే గురువారం ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కి వారి కుటుంబం ఇష్టమైన వంటకాలు పంపించారు. అయితే అది దక్కించుకోవాలంటే కంటెస్టెంట్స్ కొన్ని గేమ్స్ ఆడి గ్రహాంతరవాసులని మెప్పించాలి. అలా మెప్పిస్తే ఇంటి భోజనం అందుతుంది. ముందుగా అర్జున్ సతీమణి తన భర్త కోసం మటన్ కర్రీ, రాగి సంగటి పంపింది. అర్జున్ తన భార్య పంపిన ఫుడ్ అందుకోవాలంటే యావర్ షేక్ బేబీ షేక్ గేమ్ లో గెలవాల్సి ఉంటుందని అన్నాడు.
అయితే గతంలో యావర్ ఈ గేమ్‌లో ఫౌల్ గేమ్ ఆడగా, ఈ సారి మాత్రం చాలా అద్భుతంగా ఆడి ఫినిష్ చేశాడు. దాంతో భార్య ప్రేమతో పంపిన ఫుడ్ అర్జున్‌కి దక్కింది. ఇక ఆ ఫుడ్‌ని అర్జున్ ఇంటి సభ్యులతో షేర్ చేశాడు. అనంతరం శివాజీకి తన ఫ్యామిలీ నుంచి చికెన్ పంపించారు. శివాజీ కొడుకు వీడియో సందేశం ద్వారా.. నాన్న నీకు చికెన్ కర్రీ పంపిస్తున్నాం. హైదరాబాద్ లో డబ్బులు లేని సమయంలో ఆకలితో పార్క్ లో పడుకున్న రోజులని శివాజీ కొడుకు గుర్తు చేశాడు. అలాంటి ఆకలి రోజుల నుంచి నిన్ను ఆర్టిస్ట్ గా చేసిన ప్రేక్షకులని గుర్తు చేసుకుని చికెన్ తిను అని చెప్పాడు. అయితే చికెన్ దక్కాలంటే శివాజి తరపున ప్రియాంక గేమ్ ఆడి గెలవాలి. యారో బ్యాలన్స్ చేసే గేమ్‌ని ప్రియాంక సక్సెస్ ఫుల్‌గా ఆడి గెలిచింది.
అయితే ఆ తర్వాత శివాజీ చికెన్ తీసుకుని ఇది మా ఆవిడా చేసిన చికెన్ కాదు.. మా అత్తగారు అయినా లేదా మా అమ్మ అయినా చేసి ఉండాలి అని స్మెల్ ని బట్టి గెస్ చేశాడు. ఆ తర్వాత అమర్ కి తన సతీమణి తేజస్విని గౌడ రొయ్యల బిర్యానీ పంపగా, దీని కోసం బిగ్ బాస్ చిన్న టాస్క్ ఇచ్చారు. బెలూన్లు పగలగొట్టే టాస్క్‌ని శివాజి విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో అమర్‌కి తేజస్వికి పంపిన ఫుడ్ దక్కింది. అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులకి సరదా టాస్క్ ఇచ్చారు. హౌస్ లో ఇన్ని రోజుల పెర్ఫామెన్స్ ని బట్టి 60 నిమిషాల ఎపిసోడ్ లో కనిపించాల్సి వస్తే మీకు మీరు ఎన్ని నిమిషాలు ఎంచుకుంటారు.. ఇతరులకి ఎన్ని నిమిషాలు ఇస్తారు అని అడుగుతూ టాస్క్ ఇచ్చారు.. దీనితో ఒక్కొక్కరు తమకి నచ్చిన నిమిషాలని కేటాయించారు.