మేషం
మేషరాశి వారికి ఈ రోజు మంచి ఫలవంతమైన రోజు. ఇన్నాళ్ల మీ శ్రమకు ఫలితం కనిపిస్తుంది. మీ సంతానం పట్ల ప్రేమాభిమానాలు, అనురాగం రెట్టింపవుతుంది. ఇన్ని రోజుల శ్రమ ఫలించి మీరు అనుకున్న గమ్యం చేరుకునే సమయం ఆసన్నమైంది. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. వైద్యవృత్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు శుభవార్తలు వింటారు.
వృషభం
వృషభ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజును ఒక విజయవంతమైన రోజుగా మార్చుకోవడం మీ చేతిలోనే ఉంది. పట్టుదలతో, దృఢ నిశ్చయంతో కృషి చేస్తే అది తప్పక సాధ్యం. మీరు ఎంత కృషి చేస్తారో అంత ప్రయోజనం పొందుతారు. మీ లక్ష్యం ఏమిటో గుర్తించి కష్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు ఒకింత భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరు మీ మేలు కోరుకునేవారో, ఎవరి మనసులో దురాలోచనలు ఉన్నాయో కనిపెట్టడం కష్టం అవుతుంది. సాయంత్రానికి పరిస్థితులు చక్కబడి ప్రశాంతతను పొందుతారు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు చాలా సాధారణంగా గడిచిపోతుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ పని పట్ల పూర్తి సంతృప్తిగా లేకపోవడం వల్ల ఒకింత గందరగోళ పరిస్థితులకు లోనవుతారు.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అంతటా జయం. మీ సమర్ధతపై విశ్వాసం ఉంచి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే. మీ దృఢసంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతారు. ప్రభుత్వ లావాదేవీల్లో లాభం ఉంటుంది. మొత్తం మీద మీకు ఇది ఒక ఫలవంతమైన రోజు.
కన్య
కన్యరాశి వారికి ఈ రోజు మిశ్రమఫలితాలు ఉంటాయి. కుటుంబ విలువను గ్రహిస్తారు. చాకచక్యంగా మాట్లాడి వివాదాలకు ముగింపు పలుకుతారు. ప్రత్యర్థులు ఉంటేనే నిజమైన పురోగతి సాధిస్తామనే మాటను మీరు నమ్ముతారు.
తుల
తులారాశి వారికి ఈ రోజు ఫలవంతమైనదిగా ఉంటుంది. వివిధ రంగాల్లో సాధించిన విజయాలు, దానితో పాటు ఆర్ధిక పురోగతి మిమ్మల్ని సంతోషంగా, సంతృప్తిగా ఉంచుతాయి. స్నేహితుల కోసం ఖర్చులు విపరీతంగా చేస్తారు. కానీ దానికి బదులుగా, మీరు వారి నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.స్నేహితులతో కలిసి వినోద విహార యాత్రల్లో పాల్గొంటారు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా, అదృష్టకరంగా ఉంటుంది. మీ పనితీరు పట్ల మీపై అధికారులు పూర్తి సంతోషం వ్యక్తం చేస్తారు. పని ప్రదేశంలో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీ సంతానం చదువులో విజయాలను సాధిస్తారు.
ధనుస్సు
ధనస్సురాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఒకింత బలహీనంగా, నీరసంగా ఉండడం చికాకు కలిగిస్తుంది. వ్యాపారంలో తాత్కాలిక సమస్యలు మానసిక అశాంతికి కారణమవుతాయి. ప్రత్యేకంగా మీ సహచరులు, పోటీదారులతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడితే మేలు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉంది. దళారీలకు ఈ నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది. న్యాయసంబంధిత వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నష్ట నివారణకు అన్నివేళలా అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు చాలా ఆనందంగా గడిచిపోతుంది. మీకు నచ్చిన వారి సమక్షంలో కాలం ఆనందంగా గడిచిపోతుంది. కుటుంబంలో పండుగ వాతావారణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు కష్టేఫలి అన్నట్లుగా ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితాలను పొందుతారు. మీ సృజనాత్మకత మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. చేపట్టిన వృత్తిలో నూతన ఆలోచనలలు శ్రీకారం చుడితే మిగిలిన వారికంటే మీరే ఉన్నతంగా ఉంటారు.