Site icon vidhaatha

26-03-2024 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశుల వారికి లక్ష్మీధ్యానం శుభకరం..!

మేషం

మేషరాశి వారికి ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలం. మీరు తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతారు. ఒక ఆపద నుంచి గట్టెక్కుతారు. సూర్యుని ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు కలిసివచ్చే కాలం. కీరిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటినిర్మాణ పనులు ప్రారంభించడానికి సరైన సమయం. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. లక్ష్మీపూజ మేలు చేస్తుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసివస్తుంది. పనులు వాయిదా వేయకండి. సకాలంలో పనులు పూర్తి చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీదే! ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుతారు. మీ ఇష్టదైవం ఆరాధన మేలు చేస్తుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆపదలు, గండాలు తొలగిపోతాయి. పనిపట్ల శ్రద్ధ పెడితే మంచిది. అపార్ధాలు రాకుండా జాగ్రత్త పడితే మేలు. మీ ఓర్పే మీకు శ్రీరామ రక్ష! కుటుంబసభ్యుల సహకారంతో ఒక సమస్య నుంచి బయటపడతారు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డబ్బును పొదుపుగా ఖర్చు చేయండి. స్నేహితుల సహకారం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలతో కాలం వృథా చేసుకోవద్దు. సూర్యుని ఆరాధన మేలు చేస్తుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ఆరోగ్యం సహకరిస్తుంది. అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూలం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నవగ్రహాధ్యానం మేలు చేస్తుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. తలపెట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్ష్మీధ్యానం శుభకరం.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అవసరాలకు సరిపడా ధనం అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేసుకోండి. ఉద్యోగంలో ఒకింత ఒత్తిడి ఉంటుంది. అయితే మీ నేర్పుతో దానిని అధిగమిస్తారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అదృష్టం యోగం ఉంది. ఆర్థికంగా సంతృప్తి కరంగా ఉంటుంది. పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధికంగా అనుకూలం. పనిలో పురోగతి ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శత్రుజయం. కోర్టు వ్యవహారాల్లో విజయం.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోబలంతో ముందుకెళ్తే విజయం మీదే! వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈశ్వరారాధన మేలు చేస్తుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ఈ రోజు లాభదాయకమైన రోజు. విందువినోదాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

Exit mobile version