ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బంతిని ఎంత మెరుపు వేగంతో విసిరిన అంతే వేగంతో బౌండరీకి తరలించగల సత్తా వార్నర్‌ది. కొన్ని ఏళ్ల పాటు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు డేవిడ్ బాయ్. క్రికెట్‌లోనే కాదు సోషల్ మీడియాలోను తనదైన డ్యాన్స్‌లతో నెటిజన్స్‌కి మంచి వినోదాన్ని పంచుతూ ఉంటాడు. అయితే వార్నర్ ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలకనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వార్నర్ వన్డే, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం విదితమే. అయితే గత కొద్ది రోజులుగా వార్నర్ వెస్టిండీస్‌తో కలిసి వన్డే, టీ20లు మ్యాచ్‌లు ఆడాడు.
పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఆడగా అందులో వార్నర్ (81; 49 బంతుల్లో) పరుగులు చేశాడు. అయితే మూడు టీ 20లలోను వార్నర్ అద్భుతంగా రాణించాడు. పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్ వార్నర్‌కి ఆసీస్ గడ్డపై చివరి మ్యాచ్ కావడంతో అతను చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. మా కుర్రాళ్ల టీం అద్భుతంగా ఆడుతుంది. న్యూజిలాండ్ పర్యటనకి ఇంకా సమయం ఉంది. ఆ పర్యటన తర్వాత ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఆడనున్నాం. అయితే మధ్యలో ఈ గ్యాప్‌ని నా కుటుంబంతో గడపాలని అనుకుంటున్నా. ఇక నా బాధ్యత ముగిసిందని అని అనుకుంటున్నా అని డేవిడ్ తెలియజేశాడు. ఇక తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఓ అభిమానికి గిఫ్ట్‌గా అందించి అందరి మనసులు గెలుచుకున్నాడు వార్నర్.
ఆస్ట్రేలియాలో ఆఖరి మ్యాచ్ ఆడిన వార్నర్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ని అభిమానికి గిఫ్ట్‌గా ఇచ్చిన డేవిడ్ఇక వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ 20 విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్లకు 220 పరుగులు చేసింంది. ఆండ్రూ రసెల్ (71; 29 బంతుల్లో), రూథర్‌ఫర్డ్ (67*; 40 బంతుల్లో) అర్ధశతకాలతో విరుచుకుపడడంతో భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం ఛేదనలో వార్నర్ భారీగానే పరుగులు రాబట్టిన మిగతా ఎవరు కూడా పెద్దగా పరుగులు చేయకపోవడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 183 పరుగులే చేసింది. దీంతో మూడో టీ20లో ఓటమి చెందాల్సి వచ్చింది. వార్నర్ త్వరలో న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లనున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ కోసం ఇండియా రానున్నాడు. అనంతరం టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా పయనం కానున్నాడు.