వన్డే ప్రపంచకప్ సమరం ముగిసింది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇండియా ఒక్క ఫైనల్ మ్యాచ్‌లో తప్ప ఆడిన అన్నింట్లోను గెలిచింది.కాని ఫైనల్‌లో ఓడి కోట్ల మంది భారతీయులకి నిరాశని మిగిల్చింది. అయితే వన్డే ప్రపంచకప్ ఓటమితో నిరాశలో ఉన్న భారత్ అభిమానులకి ఇప్పుడు గుడ్ న్యూస్ అందింది. టీ20 ప్రపంచ కప్ 2024 తాత్కాలిక షెడ్యూల్ విడుదలైంది. జూన్ 4 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు తలపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జూన్ 5 నుంచి టీమిండియా టీ20 ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం చూస్తే భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆతర్వాత జూన్ 9న న్యూయార్క్‌లో జరిగే హైవోల్టేజీ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నట్టు తెలుస్తుంది. ఇక మూడో మ్యాచ్‌లో భారత జట్టు అమెరికాతో తలపడనుంది. టీం ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫ్లోరిడా వేదికగా జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్ పోటీలను వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. లీగ్ స్థాయి మ్యాచ్‌లు యూఎస్ఏలో జరగనుండగా, . సూపర్-8 మ్యాచ్‌లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫైనల్ మ్యాచ్ కూడా కరేబియన్ దేశం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు చూస్తే.. భారతదేశం.పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్,కెనడా, ఇంగ్లండ్, ఐర్లాండ్, నమీబియా, నేపాల్,,నెదర్లాండ్స్, న్యూజిలాండ్,ఒమన్,పాపువా న్యూ గినియా (PNG), స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఉగాండా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA), వెస్టిండీస్ ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే కేప్ టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. దీంతో WTC పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది భారత జట్టు. కేప్ టౌన్ టెస్టులో విజయంతో భారత్ ఖాతాలో మొత్తం 12 పాయింట్లు చేరాయి. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత 54.16 PCT పాయింట్లతో భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది