విరాట్ మ‌రోసారి క్లాసిక‌ల్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్‌పై గెలిచి చ‌రిత్ర సృష్టించిన భార‌త్

  • Publish Date - October 23, 2023 / 01:26 AM IST

వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ ప్రేక్ష‌కుల‌కి మంచి థ్రిల్ అందించింది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మ్యాచ్‌లు చ‌ప్ప‌గా సాగ‌గా, ఈ మ్యాచ్ మాత్రం మంచి మ‌జా అందించింది. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠగాస సాగింది. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ మెరుపులతో పాటు విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడ‌డంతో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 273 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్‌ తరపున డారిల్ మిచెల్ (130) సెంచరీ చేయగా, రచిన్ రవీంద్ర (75 పరుగులు) అర్ధ సెంచరీతో రాణించడంతో పాటు గ్లెన్ ఫిలిప్స్ 23 పరుగులు చేయ‌డంతో న్యూజిలాండ్‌కి మంచి స్కోర్ ద‌క్కింది. మహ్మద్ షమీ 5 వికెట్లు , కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక్కో వికెట్ దక్కించుకోగా, ఒక‌రు ర‌నౌట్ అయ్యారు.

ఇక 274 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి మంచి శుభారంభం దక్కింది అని చెప్పాలి. 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కి 71 పరుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ఆ త‌ర్వాత రోహిత్ బోల్డ్ కాగా, గిల్ 31 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసి ఔట‌య్యాడు. శ్రేయార్ అయ్యార్ ఈ మ్యాచ్‌లో నిరాశ‌ప‌రిచాడు. 29 బంతుల్లో 6 ఫోర్లతో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంత‌రం కెఎల్ రాహుల్- విరాట్ కోహ్లీ కలిసి నాలుగో వికెట్‌కి 54 పరుగులు జోడించారు. ఈ క్ర‌మంలో 35 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. స‌మ‌న్వ‌య లోపం వ‌ల‌న సూర్య‌కుమార్ యాద‌వ్ ర‌నౌట్ అయ్యాడు. ఈ క్ర‌మంలో 191 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇండియా గెలుస్తుందా లేదా అనే సందేహం అంద‌రిలో క‌లిగింది.

ఈ క్ర‌మంలొఓ రవీంద్ర జడేజాతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించాడు. విజ‌యానికి 24 బంతుల్లో 19 పరుగులు కావల్సిన ద‌శ‌లో 6, 4 బాదిన విరాట్ కోహ్లీ… కొంత రిలాక్స్ ప‌ర‌చాడు.ఇక టీమిండియా విజయానికి 7 పరుగులు కావాల్సిన దశలో భారీ షాట్‌కి ప్ర‌య‌త్నించి కోహ్లీ ఔట‌య్యాడు. ఇక చివ‌రిగా జ‌డేజా ఫోర్ కొట్టి భార‌త్‌కి మంచి విజ‌యం అందించాడు. ఈ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పుడు 5 మ్యాచ్‌ల తర్వాత టీమిండియా ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి.ఇక ఈ విజ‌యంతో 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై ఐసీసీ మ్యాచ్ గెలిచిన టీమిండియాగా భార‌త్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.

Latest News